కరోనా వైరస్ అమ్మ.. కరోనా వైరస్. ఈ వైరస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వైరస్ కారణంగా బిజీగా ఉండే పిల్లలు.. పెద్దలు.. అందరూ కూడా ఇంట్లోనే పడ్డారు. దీంతో అమ్మ చేతి వంట మిస్ అయినా వారంతా ఇప్పుడు ఓ రేంజ్ లో అమ్మ చేసే రుచికరమైన వంటను ఆస్వాదిస్తున్నారు.. అలానే ఈ వంకాయ బఠాణి కర్రీని ఇలా చేయించుకొని తినండి.. ఆహా అనండి.. 

 

కావాల్సిన పదార్ధాలు... 

 

వంకాయలు - పావుకిలో, 

 

పచ్చి బఠాణీలు - కప్పు, 

 

పచ్చిమిర్చి - మూడు, 

 

అల్లం - అంగుళం ముక్క, 

 

వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, 

 

దనియాలపొడి - 2 టేబుల్‌ స్పూన్లు, 

 

కారం - టీస్పూను, 

 

ఉప్పు - తగినంత, 

 

కొత్తిమీర తురుము - టేబుల్‌ స్పూను, 

 

కొబ్బరి తురుము - టేబుల్‌ స్పూను, 

 

ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు - తాలింపుకు సరిపడేన్ని.

 

తయారీ విధానం...  

 

అల్లం వెల్లుల్లి పేస్ట్ లా తయారు చేసి పక్కన పెట్టాలి.. పచ్చిమిర్చి కూడా ముద్దలా చేసి పక్కన పెట్టాలి. ఎండు బఠాణీలను రాత్రే నానబెట్టి కుక్కర్‌లో ఉడికించాలి. పాన్ లో నూనె వేసి తాలింపు దినుసులన్నీ వేసి వేగిన తర్వాత అల్లంవెల్లుల్లి వేసి పచ్చిమిర్చి ముద్ద, బఠాణీలు వేసి ఓ నిమిషం వేయించాక కొద్దిగా నీళ్లు చిలకరించి మూతపెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత వంకాయ ముక్కలు వేసి మూతపెట్టి ఉడికించాలి. చివరగా దనియాలపొడి, కారం, ఉప్పు, కొబ్బరితురుము, కొత్తిమీర తురుమువేసి ఉడికించి దించేయాలి. అంతే గుమగుమలు ఆడే వంకాయ బఠాణీ కర్రీ అదిరిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: