శొంఠి కాఫీ.. అనారోగ్యాలన్నింటికి అమృత వైద్యంగా ఉపయోగపడుతుంది. మనకు జలుబు చేసిన.. గొంతు నొప్పి వచ్చిన ఈ కాఫీ తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. అలాంటి ఈ శొంఠి కాఫీని తాగండి గొంతు నొప్పి పోగొట్టుకోండి. అయితే ఈ శొంఠి కాఫీ ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. ఇంట్లో చేసుకొని ఉదయం లేవగానే తాగండి. 

 

కావాల్సిన పదార్థాలు... 

 

శొంఠి - 100 గ్రా,

 

ధనియాలు - 75 గ్రా,

 

బెల్లం పొడి - కావలసినంత

 

తయారీ విధానం.. 

 

శొంఠి ధనియాలు దోరగా వేయించి పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక గ్లాసు నీరు మరిగించి, ఒక స్పూను శొంఠి పొడి వేసి 2 నిమిషాలు మరిగించాలి. అందులో బెల్లం కలిపి కరిగాక వడకట్టాలి. అంతే శొంఠి కాఫీ రెడీ. ఈ కాఫీ ని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.     

మరింత సమాచారం తెలుసుకోండి: