ఆమెకు వంట చేయడం అంటే ఎంతో ఇష్టం. త‌న‌కు న‌చ్చిన ప‌ని కూడా అదే. కానీ విచిత్రంగా ఆ మ‌హిళ వంట తిన్న‌వారంతా టైఫాయిడ్‌కు గుర‌వుతుండేవారు..కొంత‌మంద‌యితే చ‌నిపోయేవారు..ఇలా ఒక‌రు కాదు..ఇద్ద‌రు కాదు..వేలాదిమంది ఆమె కార‌ణంగా టైఫాయిడ్ బారిన ప‌డ‌టంతో చివ‌రికి ఆమెను పోలీసులు అరెస్టు చేసి మ‌నుషుల్లేని దీవిలో 30 ఏళ్ల పాటు ఉంచారు. త‌న‌కే తెలియ‌ని ఓ వింత కార‌ణంతో ఆమె 30 ఏళ్లు జీవించి ఆ దీవిలోనే చివ‌రికి కన్నుమూసింది. ఈ విచిత్ర‌మైన మ‌హిళ నుంచి టైఫాయిడ్ ఎలా వ్యాప్తి చెందింద‌నే విష‌యం నేటికి మిస్ట‌రీగానే ఉండిపోవ‌డం గ‌మ‌నార్హం. మేరీ  మ‌ల్లాన్ 1869, సెప్టెంబర్ 23న ఉత్తర ఐర్లాండ్‌లోని కూక్స్‌టౌన్ అనే గ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించింది. 

 

ఆమె వంటలు తినేవారు ఎవరైనా సరే.. మెచ్చుకోకుండా ఉండలేరు. అంత బాగా చేస్తుంది మ‌రీ. దుర‌దృష్ట‌వ‌శాత్తు ఆమె వంట తిన్న‌వారంతా టైఫాయిడ్‌కు గురయ్యేవారు. దీంతో ఆమె పేరు ‘టైఫాయిడ్ మేరీ’గా మారిపోయింది.  చిత్రం ఏమిటంటే.. ఆమె ఏనాడు టైఫాయిడ్‌కు గురికాలేదు. మరి, ఆమె వల్ల టైఫాయిడ్ ఎందుకొస్తోందో తెలియ‌రాలేదు. సాధారణంగా టైఫాయిడ్ వచ్చిన రోగి ద్వారానే అది ఇతరులకు వ్యాపిస్తుంది. కానీ, మేరికి మాత్రం ఏ రోజు టైఫాయిడ్ రాలేదు. కానీ, ఆమె వల్ల ఇతరులకు ఆ వ్యాధి వ్యాప్తి చెందేది. అయితే, ఈ విషయం మొదట్లో ఎవరికీ తెలిసేది కాదు. చివరికి మేరీకి కూడా తెలీదు.. అయితే 1906లో చార్లెస్ హెన్రీ వారెన్ అనే వ్యక్తి, మరో పదిమంది కుటుంబ సభ్యులతో కలిసి ఓ ఇంటిలో నివసించేవాడు. కొద్దిరోజుల త‌ర్వాత ఆ ఇంట్లోని ఆరుగురికి ఒకేసారి టైఫాయిడ్ వచ్చింది.

 

 హెన్రీ ఇల్లు చాలా పరిశుభ్రంగా ఉంటుంది. దీంతో అపరిశుభ్రత వల్ల ఆ వ్యాధి ఏర్పడే అవకాశం లేదు. ఆ ఇంట్లో కొత్తగా వచ్చిన వ్యక్తి.. వంట మనిషి మేరీ మాత్రమేన‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చాడు. అయితే, ఆ ఇంట్లోవారు టైఫాయిడ్‌కు గురైన వారం రోజుల్లోనే ఆమె ఆ ఉద్యోగం వదిలి వెళ్లిపోయింది. దీంతో సాపర్‌కు ఆమెపై అనుమానం కలిగింది. దీంతో ఆమె ప‌నిచేసిన పాత ఇళ్ల‌లో మేరీ గురించి తెలుసుకోవ‌డంతో షాకింగ్కు గురి చేసే నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. వంట మనిషి మేరీ ఎక్కడా పూర్తిగా పనిచేయదని, ఎప్పుడూ ఉద్యోగం మారుతూనే ఉంటుందని తెలుసుకున్నాడు. అంతేకాదు, ఆమె పనిచేసే ప్రాంతాల్లో టైఫాయిడ్ వ్యాపిస్తుందనే విష‌యం తెలుసుకుని వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. 

 

దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆమె టైఫాయిడ్‌ను వ్యాప్తి చేస్తోందనే ప్ర‌చారం బాగా జ‌ర‌గ‌డంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఆమెను న్యూయార్క్ సముద్రం తీరానికి శివారులో ఉన్న నార్త్ బ్రదర్ దీవిలో బంధించారు. ఈ శిక్షను మేరీ వ్యతిరేకించింది. మ‌ధ్య‌లో విడుద‌లైన మ‌ళ్లీ వంట చేయ‌డం..కోర్టు తీర్పుతో మ‌ళ్లీ దీవిలోనే ఆమెను బంధించ‌డం జ‌రిగాయి. దాదాపు 30 ఏళ్ల పాటు మేరీ  ఒంట‌రిగా మ‌నుష్యుల్లేని దీవిలో ఉంటూ న్యూమోనియాతో బాధ‌ప‌డుతూ చ‌నిపోయింది. మేరీ  టైఫాయిడ్‌కు గురికాకుండా దాన్ని ఎలా వ్యాప్తి చేసింద‌నేది ఇప్ప‌టికీ తేల‌ని స‌మాధానం. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: