సాధార‌ణంగా గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకున్న శ్రద్ధ, జాగ్రత్తలు.. డెలివ‌రీ జరిగిన తర్వాత కూడా తీసుకోవాలి. అయితే ప్రెగ్నెన్సీలో వచ్చిన శారీరక మార్పులు మరియు అధిక బరువు, ప్రసవం తర్వాత కూడా అలాగే కొనసాగితే, తల్లికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొత్త తల్లికి అదనపు బరువు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఎంత తిండి మానేసినా.. శరీరాకృతిలో మార్పు  రాదు. కాని, బరువు తగ్గాలని పూర్తిగా ఆహారాన్ని మానేయడం చాలా తప్పు. శరీరానికి తగిన క్యాలరీలను అందేలా చూసుకోవాలి. 

 

అయితే ఈ అధిక బ‌రువుకు సులువుగా కూడా చెక్ పెట్ట‌వ‌చ్చు. అది ఎలాగో చూసేయండి మ‌రి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో రెండు స్పూన్ల నిమ్మరసం మరియు ఒక స్పూన్ తేనె కలుపుకుని ఉదయాన్నే ఈ నీటిని తాగడం చేయాలి. లేదా భోజనం తీసుకునే పది నిముషాల ముందు ఇది తీసుకోవడం వ‌ల్ల కూడా బ‌రువు త‌గ్గొచ్చు. అలాగే మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి. రోజుకి కనీసం మూడు లీటర్ల నీరు తగ్గకుండా తీసుకుంటే.. బ‌రువు త‌గ్గ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.

 

అదేవిధంగా, ప్రతి రోజూ ఉదయం నోరు శుభ్రం చేసుకున్న తర్వాత రెండు వెల్లుల్లి రిబ్బలను తినడం వలన కొవ్వును శరీరంలోకి చేరనివ్వదు. ముఖ్యంగా కరివేపాకును మీ ఆహారంలో తప్పనిసరిగా ఉండేలా చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా బ‌రువు త‌గ్గొచ్చు. మ‌రియు ప్రతి రోజూ మీ బిడ్డకు బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వలన దాదాపు ఐదు వంద‌ల కేలరీలు ఖర్చు అవుతాయి. ఇలా చేయడం వలన మీ శరీరంలో కొవ్వు శాతం క్రమంగా తగ్గిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: