"అమ్మ అను మాటకు అర్దాలే వేరు. ఎన్ని భాషల్లో పిలిచినా అమ్మ అమ్మే.. దెబ్బతగిలినపుడు ఎవరైనా సరే అమ్మా అని అనాలిసిందే. అది మనిషి అయిన గాని,   దేవుడు అయినా గాని. అమ్మ అన్న మాటలో ఉంది  ఆప్యాయత, అనురాగం. సృష్టి కర్త బ్రహ్మ అయితే ఆ బ్రహ్మని సృషించింది కూడా అమ్మే.  బిడ్డ ఏడుస్తున్నపుడు అమ్మ అసలు తట్టుకోలేదు. ఆమ్మో నాబిడ్డ ఏడుస్తున్నాడే అని తల్లి ప్రాణం విల విల ఆడిపోతుంది.

 

కానీ మనం ఏడుస్తున్నపుడు అమ్మ సంతోషించే క్షణం ఏదైన ఉందంటే అది  మనం పుట్టిన క్షణం మాత్రమే. మనం ఏడిచే ఏడుపు విని అప్పటిదాకా పడ్డ పురిటినొప్పులు సైతం మరిచిపోయి మనల్ని చూసి ఆనందిస్తుంది. మన బుడ్డి బుడ్డి చేతులు, కాళ్ళు పట్టుకుని ముద్దాడుతూ కంట తడి పెట్టి మనల్ని హృదయానికి హత్తుకునేది అమ్మ. మన మొదటి స్పర్శ అమ్మ,  మన తొలి పలుకు అమ్మ, మన  మొదటి అడుగు నేర్పేది అమ్మే. ఇలా మన ప్రతి విషయంలో మనతో పాటు ఉండి, మనకి మంచి, చెడు చేబుతూ మనల్ని ఒక గమ్య స్థానానికి చేర్చేది అమ్మే. 

 

అమ్మ చేసే ప్రతి పని మన ఆనందం కోసమో..మన ఆనందంలోనే   తన ఆనందాన్ని చూసుకుంటుంది అమ్మ.  దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక, అమ్మను సృష్టించాడు. కానీ  మనం ఈ విషయం తెలుసుకోకుండా జన్మనిచ్చి, ఇంతటి వారిని చేసిన దేవతను కళ్ల ముందు ఉంచుకుని, కనిపించని ఆ దేవుడు కోసం గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతుంటాం.. సాక్షాత్తు ఆ వినాయకుడే తల్లి తండ్రులు చుట్టూ ప్రదక్షిణాలు చేసి నెగ్గాడు. మనం ఎంత ! బ్రహ్మదేవుడు సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు. వాస్తవానికి బ్రహ్మ అమ్మను సృష్టించలేదు. అమ్మే బ్రహ్మను సృష్టించింది.. మన పెద్దలు సైతం ‘మాతృదేవోభవ', పితృదేవోభవ’ అంటూ అమ్మకే అగ్రతాంబూలం ఇచ్చారు.దేవుడు ఎక్కడో లేడు. నిన్ను కన్న అమ్మరూపంలోనే...

 

అనుక్షణం నిన్ను కాపాడుతూ..నీవెంటే అమ్మ రూపంలో ఉంటాడు.  అమ్మ తన జీవితంలో సగం జీవితం తల్లి తండ్రులు కోసం గడిపింది. తర్వాత  సగం జీవితం భర్త, పిల్లల కోసం గడిపింది. మన అందరికి జీవితాన్ని ఇచ్చిన అమ్మ తన జీవితం మాత్రం పిల్లలకే అంకితం చేసింది. అమ్మ గూర్చి ఎన్ని మాటలు చెప్పిన తక్కువే అవుతుంది.. ఇంగ్లీష్ వాళ్ళు "మామ్" అని పిలిచినా, తెలుగు వాళ్ళు "అమ్మ "అని పిలిచినా... పిలిచే పిలుపు మారిద్దికానీ పలికే పలుకు మాత్రం మారదు.. "మా కోసం ని ..(అమ్మ)జీవితాన్ని త్యాగం చేసిన అమ్మా  నీకు శతకోటి వందనాలు"  మాకోసం ఇంత చేసిన నీకు ఏమి ఇవ్వగలం,  గుండెలనిండా  ఉన్న ప్రేమతో  "అమ్మ "అని పిలిచే పిలుపు తప్ప... !ఏది ఇచ్చినా తక్కువే అమ్మా... !

మరింత సమాచారం తెలుసుకోండి: