గర్భాధారణ అనేది తల్లిదండ్రులకు ఇద్దరికీ ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా గర్భిణీకి. ఎందుకంటే.. తల్లి అనిపించుకున్నప్పుడే ఆడజన్మకు సార్థకత. అమ్మ అని పిలిపించుకోవాల‌ని ప్ర‌తి స్త్రీ కోరుకుంటుంది. గర్భం అనేది సృష్టి రహస్యం. ఇది మహిళలకు దేవుడిచ్చిన ఓ అపురూపమైన కానుక. ఇక‌ గర్భం దాల్చిన వెంటనే ఆ స్త్రీ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. అందులో భాగంగా గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది. మ‌రియు ఆరోగ్యమైన శిశువు కొరకు పౌష్ఠిక ఆహారం ఖ‌చ్చితంగా తీసుకోవాలి. 

 

అయితే ప్రెగ్నెన్సీ మహళలు ఉన్న ఇంట్లో కొన్ని వస్తువులు ఉండకూడదు. అవేంటో ఓ లుక్కేసేయండి. అందులో ముందుగా పెయింట్స్‌. గోడలపై వేసే పెయింట్ శిశువు చాలా త్వరగా పుట్టడానికి కారణం కావచ్చు. అంతేకాదు శిశువు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అలాగే గర్భిణీ ఉన్న ఇంట్లో అస్స‌ల ఉండ‌కూడ‌ని వాటిలో ప్లాస్టిక్ కూడా ఒక‌టి. ఈ ప్లాస్టిక్స్‌లో థాలెట్స్ వంటి కొన్ని హానికరమైన పదార్థాలు ఉంటాయి. ఇది చర్మం ద్వారా సులభంగా గ్రహించబడుతుంది మరియు విపరీతమైన ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు విడుదల అవుతుంది. 

 

ఈ రసాయనాలు క‌డుపులోని బిడ్డ‌కు అనేక‌ విధాలుగా హాని కలిగిస్తాయి. అదేవిధంగా, దోమ‌లు, బొద్దింక‌లు రాడటానికి కొన్ని స్ప్రేలు అనువైనవి అయినప్పటికీ అవి గర్భిణీ స్త్రీలకు మంచిది కాదు. అవి సురక్షితమైనవని చెప్పినప్పటికీ వాటిలో ఉండే కొన్ని రసాయనాలు గ‌ర్భిణీ చర్మాన్ని దెబ్బతీస్తాయి. అంతేకాకుండా శిశువు అభివృద్ధిపై దెబ్బ‌తీస్తాయి. అందుకు గ‌ర్భిణీలు ఇలాంటి స్పేల‌కు దూరంగా ఉంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: