కావాల్సిన ప‌దార్థాలు:
దొండకాయలు- పావు కేజీ
జీలకర- రెండు టీ స్పూన్లు
శనగపప్పు- ఆరు టీ స్పూన్లు
ఎండుమిర్చి- ఐదు

 

వెల్లుల్లి- ఆరు రేక‌లు
ఉప్పు- రుచికి తగినంత
నూనె- త‌గినంత‌

 

తాలింపు కోసం:
మినప్పప్పు- ఒక టీ స్పూన్‌
కరివేపాకు- రెండు రెబ్బ‌లు
ఆవాలు- అర టీ స్పూన్‌
జీలకర- అర టీ స్పూన్‌

 

త‌యారీ విధానం: ముందుగా జీలకర, శనగపప్పు, ఎండుమిర్చి దోరగా వేగించి వెల్లుల్లి, ఉప్పు కలిపి పొడి కొట్టి, ఒక టీ స్పూన్‌ నూనె కలపాలి. ఇప్పుడు దొండకాయలకు నిలువుగా కత్తితో నాలుగు వైపులా గాటు పెట్టుకోవాలి. త‌ర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న‌ మిశ్రమం దొండ‌కాయ‌ల్లో కూరి అరగంట పక్కనుంచాలి. 

 

ఇప్పుడు పాన్‌లో నూనె వేడెక్కాక ఈ దొండకాయల్ని సన్నని సెగమీద మగ్గించాలి. తర్వాత మరో పాన్‌లో తాలింపు చేసుకుని ఇందులో వేస్తే స‌రిపోతుంది. అంతే దొండ‌కాయ గుత్తి కూర రెడీ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: