మనం ఎన్నో రకాల ఆమ్లెట్లు చేసుకొని తింటుంటాం.. అలాంటి ఈ ఆమ్లెట్ ను చీజ్ తో చేసుకొని తింటే ఎంత రుచిగా ఉంటుంది.. ఈ ఆమ్లెట్ ను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. సాయింత్రం సమయంలో చేసి పెడితే ఇష్టంగా లాగించేస్తారు.. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే తయారి విధానం తెలుసుకొని చేసి పెట్టేయండి.. 

 

కావాల్సిన పదార్ధాలు.. 

 

కోడిగుడ్లు - రెండు, 

 

ఉల్లిముక్కలు - పావుకప్పు,

 

క్యాప్సికమ్‌ ముక్కలు - పావుకప్పు, 

 

ఉప్పు - కొద్దిగా, 

 

కొత్తిమీర తురుము - 2 టేబుల్‌ స్పూన్లు, 

 

నూనె - 2 టీస్పూన్లు, 

 

చీజ్‌ - సుమారు పావుకప్పు, 

 

కారం - పావు టీ స్పూను, 

 

పసుపు - చిటికెడు, 

 

గరం మసాలా - పావు టీ స్పూను, 

 

తయారీ విధానం..  

 

ఒక చిన్న గిన్నెలో గుడ్లసొన వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి.. ఆతర్వాత నాన్‌స్టిక్‌ పాన్‌లో నూనె వేసి ఉల్లిముక్కలు, క్యాప్సికమ్‌ ముక్కలు, ఉప్పు వేసి చిన్నమంట మీద వేయించాలి. ఆతరవాత గరం మసాలా, పసుపు, కారం, కొత్తిమీర తురుము అన్నీ వేసి వేయించి.. గుడ్లసొనలో వేసి కలపాలి. ఇప్పుడు పాన్‌పై టీస్పూను నూనె వేసి గుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా వేసి రెండు వైపులా కాలాక ఒకవైపున చీజ్‌ తురుము చల్లి అది కరిగేవరకూ సిమ్‌లో ఉంచి దించాలి. అంతే ఎంతో రుచికరమైన చీజ్‌ ఆమ్లెట్‌ రెడీ.. ఈ చీజ్ ఆమ్లెట్ ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: