ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తుండ‌గా చాలా మంది క‌మ‌లా పండ్లు కొని రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచుకుంటున్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచుకునేందుకు పండ్లు బాగా తినాల‌ని చెప్ప‌డంతో పాటు తెలంగాణ నుంచి క‌మ‌లా పండ్ల ఎగుమ‌తుల‌ను కూడా నిషేధించింది. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం క‌మ‌లా పండ్ల‌ను స్థానికంగానే అందుబాటులో ఉండేలా చేస్తోంది.ఇక క‌మ‌లాపండ్ల వ‌ల్ల ఎన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయో ?  క‌మ‌లా పండ్ల తొక్క‌ల్లో సైతం అంత‌కుమించిన ఆరోగ్య ర‌హ‌స్యాలు ఉన్నాయి. 

 

క‌మ‌లా పండ్ల తొక్క‌ల్లో ఉన్న అందం ర‌హ‌స్యాలు చాలానే ఉన్నాయి. క‌మ‌లా పండ్ల తొక్క‌ల‌ను స్కిన్‌పై మొత్త‌గా ర‌ద్దుకుంటే ముందుగా చ‌ర్మం కాంతి వంతంగా మారుతుంది. ఇక చ‌ర్మం నుంచి మంచి సువాస‌న కూడా వ‌స్తుంది. క‌మ‌లా తొక్క‌ల‌ను ఆయిల్లో వేసి మ‌న అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్టుగా కూడా వాడ‌వ‌చ్చు. ఇక ఎండిన క‌మ‌లా తొక్క‌ల‌ను టీ లో వేసి రెండు ల‌వంగాలు.. కొద్దిగా అల్లం వేసి ఉడ‌క‌పెట్టి తాగితే అది శీరరానికి మంచి ఉత్తేజాన్ని ఇవ్వ‌డంతో పాటు ఆరోగ్యంగా కూడా మంచిది.

 

ఇక క‌మ‌లా తొక్క‌లు ఎండిపోయాక వాటిని పొటి చేసి బ్యాగుల్లో వేసి ఇంట్లో డ్రాయ‌ర్లు.. సొరుగులు, క్లోసెట్స్‌లో వేస్తే గ‌దిలో కావాల్సినంత సువాస‌న వ‌స్తుంది. అలాగే ఎండిపోయిన క‌మ‌లా తొక్క‌ల‌తో పొడి చేసి వాటిని కొవ్వొత్తి మైనంలో మిక్స్ చేస్తే ఆరెంజ్ ఫ్లేవర్ క్యాండిల్స్ వెలుగుతాయి. అలాగే ఆరెంజ్ తొక్కల పొడి కేకు త‌యారీలో జెస్ట్‌లా క‌లిపితే ఆ తర్వాత కేక్ బేకింగ్ చేస్తే... కేక్ టేస్ట్ కొత్తగా ఉండటమే కాదు... కేక్ క్రీమీగా కూడా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: