మ‌హిళ‌కు ప్రెగ్నెన్సీ టైమ్ చాలా ముఖ్య‌మైన‌ది. ఈ సమయంలో ప్రతి మహిళ కూడా ఎన్నో అనుభూతులను పొందుతుంది. ఇక ఈ టైమ్‌లో మహిళ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అది ప్రతి స్త్రీ కూడా తెలుసుకోవాలి. గర్భంతో ఉన్నప్పుడు తనలో జరిగే మార్పుల గురించి తెలుసుకుని ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి. అలాగే ప్రెగ్నెన్సీ టైమ్ లో ఆహార విష‌యంలోనే కాకుండా.. అన్ని విష‌యాల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

 

మ‌నం చేసే ప‌నులు, తీసుకునే జాగ్ర‌త్త‌లు బ‌ట్టీ క‌డుపులోని బిడ్డ ఆరోగ్యం, ఎదుగుద‌ల‌ ఆధారపడి ఉంటుంది. ఇక ఈ సమయంలో కొన్ని పనులు అస్సలు చేయకూడద‌ని మ‌న‌కు తెలుసు. అయితే కొన్నింటి వాసనలు కూడా అస్సలు చూడకూడదంటున్నారు నిపుణులు. మ‌రి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా నాఫ్తలీన్ బాల్స్ మనం ఇంట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. నాఫ్తలీన్ బాల్స్ ను కీటకాలు రాకుండా ఉండేందుకు మరియు వాసన కోసం వాడుతాం. 

 

కానీ, ఇది ఒక విష రసాయనం. వీటి వల్ల గర్భవతులకు వికారం, మైకం వంటివి క‌ల‌గ‌డ‌మే గాక‌.. దాని ప్ర‌భావం బిడ్డ‌పై కూడా ప‌డుతుంది. అలాగే ప్రెగ్నన్సీ సమయంలో కెఫిన్, ఆల్కహాల్ వంటి అలవాట్లను విడిచిపెట్టాలి. మ‌రియు వాటి వాస‌న కూడా పీల్చ‌కూడ‌దంటున్నారు. అప్పుడే మీ శిశువు లోపల ఆరోగ్యంగా పెరుగుతుంది. మ‌రియు కాలిన ప్లాస్టిక్ వాస‌న‌ల‌కు గ‌ర్భ‌వ‌తులు దూరంగా ఉండాలంటున్నారు. ఎందుకంటే.. దాని ప్ర‌భావం క‌డుపులోని బిడ్డ ఎదుగుద‌ల‌పై ప్ర‌భావం చూపుతుంది.
 


 

మరింత సమాచారం తెలుసుకోండి: