అమ్మ  ఈ మాటలో తీయదనమేంతో వుంది .అమ్మ లేనివారు నిజంగా అనాధలే .అమ్మ కొండంత ధైర్యం మనకి .అమ్మ  ప్రేమ కీ నిలువెత్తు రూపం.ఏ కల్మషం లేనిది అమ్మ ప్రేమ .

 

పిల్లల పెంపకం లో అమ్మ పాత్ర చాలా వుంటుంది .అలా అని తండ్రి కి లేదా అనికాదు . తండ్రి పిల్లల బాగోగులు చూస్తాడు .కాని  పిల్లలు క్రమ శిక్షణ తో పెరగాలి  అంటే తల్లి పాత్ర చాలా కీలకం .పుట్టిన పసిగుడ్డు తో మొదలుకొని వాళ్ళు పెరిగి పెద్దయ్యి ఒక మంచి భవిష్యత్తు ఏర్పరుచుకోనే వరకు  బిడ్డ యొక్క ప్రతీ వయసులో తల్లి వెన్నంటే వుంటుంది.ఉగ్గుపాలతో మాట్లాడటం నేర్పించటం మొదలు తన బిడ్డ తప్పటడుగులు వేయకుండా కంటికి రెప్పలా కాపాడే ప్రయత్నం చేస్తుంది కన్నతల్లి .

 

 

ఇక ఆడపిల్ల లకు తల్లి అవసరం ఎంతో వుంటుంది . ఆడపిల్ల జీవితంలోని ప్రతి ముఖ్య మైన మలుపుల్లో తల్లి అండగా వుండి మానసిక ధైర్యం ఇస్తుంది.గృహిణి గా తన బాధ్యతను సక్రమంగా నిర్వహించి, తల్లిగా కూడా పిల్లల వున్నతికీ శ్రమిస్తోనే వుంటుంది.పిల్లలకు ఎప్పుడు ఏదీ అవసరమో తెలుసుకోని వాళ్ళు చెప్పకపోయినా కూడా అర్థం చేసుకోంటుంది.మన  జీవితంలోని ప్రతీ విషయానికీ  ప్రతీ నిమిషానికి  అమ్మ వుంటుంది .తన బిడ్డలు బాగుండాలనీ ప్రతీ  తల్లి పడే ఆరాటం నిజంగా అభినందనీయం అందరి కడుపు నిండా భోజనం పెట్టి, చివరికి తను పస్తులంటుంది .అమ్మ ప్రేమ ను వెలకట్టలేం.ఈ భూమి మీద పుట్టిన ప్రతీ జీవికి అమ్మ వుంది అమ్మ ప్రేమ వుంది. 

 

అయినా అమ్మ గురించి చెప్పటం అంటే అవివేకం అవుతుంది .ఈ భూమి మీద పుట్టిన ప్రతీ జీవికి అమ్మ వుంది అమ్మ ప్రేమ వుంది .మన ప్రధాని మోది  ఎంత పనులు ఒత్తిడి వున్నా కూడా వీలు చేసుకోని ఆయన తల్లిగారి దీవెనలందుకొంటూవుంటారు  దేశానికి  ప్రధాని అయినా ఒక తల్లి కీ బిడ్డే ఆమె నేర్పిన మంచిచెడుల అడుగుజాడల్లో నడిచి ఈ రోజు ఇంతటి వున్నంత స్థానం చేరుకోన్నారాయన .అందుకే తల్లి పాత్ర పిల్లల పెంపకం లో కీలకం "తల్లే తొలిగురువు" ప్రతీ వ్యక్తి కి ....! అటువంటి అమ్మకు నా పాదాభివందనం 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: