అమ్మ ప్రేమ పాలకంటే స్వచ్చమైంది. ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో మనల్ని బాధపెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాని మనం కోపంతో ఎప్పుడైనా కసురుకున్నా, మనల్ని ఏ మాత్రం బాధపెట్టని, అసలు ఆ ఆలోచనే రానివ్వని ఒకేఒక వ్యక్తి అమ్మ. మనం ఎదుటి వ్యక్తిలో లోపాల్ని వెతుకుతాం - కాని మనలో ఎన్ని లోపాలున్నా మనల్ని ప్రేమించేది అమ్మ ఒక్కటే.

 

అందుకే అమ్మంటే నాకు మాత్రమే కాదు అందరికీ ప్రాణం. వెలకట్టలేనిది తల్లి ప్రేమ. ఈ లోకంలో తల్లి ప్రేమ అనేది చాలా విలువైనది. తల్లి ప్రేమలో కల్మషం అంటూ ఏమి ఉండదు. తల్లి ఎప్పుడూ కూడా తన బిడ్డలను ఒకేరకంగా చూసుకుంటుంది. బిడ్డలు ఎంత పెద్దవారైనా ఆ తల్లికి ఇంకా చిన్న పిల్లల వలె కనిపిస్తారు. పక్షి తన రెక్కలతో పిల్లలను కాపాడుతుంది. రెక్కలు రాని చిట్టి తల్లి కోసం ఆ తల్లి గూడు తయారు చేసుకుంటుంది. రెక్కలు రాని చిట్టి తల్లి కోసం ఆ తల్లి పడరాని పాట్లు పడుతుంది. అలాగే మనకోసం కూడా మన అమ్మ చాలా పాట్లు పడుతుంది.

 

తల్లి ప్రేమను చవిచూసిన వారికి తెలుసు తల్లి విలువ. మన నోట్లో అమృత బిందువులు చిలికింది అమ్మే కదా. మనం ఏవేళ వచ్చినా అన్నంపెట్టే తల్లి ఆమె. మనం తల్లికి ఏమిచ్చినా రుణం తీరదు. "గూడులేని పిల్లలకు తెలియాలి గూటి విలువ''. "రక్షించే చేతులు లేని అనాధలకు తెలుసు చేతుల వెచ్చదనం'' అన్న మాటలు అక్షర సత్యాలు. పక్షులు గూటి నుండి ఎగిరిపోయినట్లు పిల్లలు చదువుకొని జీవనయానంలో స్థిరపడి, వారి కుటుంబాలు వారికి ఏర్పడతాయి. అప్పుడు అమ్మ గూర్చి ఆలోచన కూడా తగ్గుతుంది. ఎల్లప్పుడూ బిడ్డల గురించే ఆరాటపడే గొప్ప హృదయం ఆమెది. మన గురించి తపనపడే ఆరాటపడే ఆమె హృదయం ముందు మనమిద్దామనుకున్న బహుమతులన్నీ దేనికీ సాటికాదు. ఒక్క అమ్మ అనే పిలుపు తప్ప... !!

మరింత సమాచారం తెలుసుకోండి: