అమ్మ మన ఆత్మకి అనుభూతిని కలిగించే ‘కమ్మని’ మాట! ఆత్మకి ఆనందాన్ని అంతులేని మహదానందాన్ని కలిగించేదే అనుభూతి – ‘అమ్మ’లో ఆ అనుభూతి వుంది. వ్యక్తికి ‘జన్మ’నిచ్చి స్త్రీ( శక్తి) ‘అమ్మ’గా అవతరించి, తాను తరించినట్లు ‘తృప్తి’తో తానూ జన్మపరిపూర్ణతా భావంతో అనుభూతి చెంది ఆనందిస్తుంది.

 మాతృత్వంతో ‘మాత’గ తన జీవితన్ని సార్థకత చేసుకుంటుంది. 

ఏదో రూపంలో ఏమేరకైనా ప్రతిజీవిలోనూ “మాతృత్వం” అందులోని మాధుర్యం అనుభవపూర్వకమే!

 

 

తండ్రిని గౌరవించి – తల్లిని పూజించడం (మనస్సులోనైనా) సంస్కారం కలిగిన – కనీస యింగిత జ్ఞానం కలిగిన ప్రతి మనిషికి కనీస కర్తవ్యం – తాను ఎంత ప్రయోజకుడైనా తనకు ‘జన్మ’నిచ్చినవారికంటె ఎన్నో రంగాలలో  అధిక్యత కలిగివున్నప్పటికి  ‘జన్మ’ని మర్చిపోకూడదు. ఆ జన్మ ‘ప్రారంభ పెట్టుబడి’గా మాత్రమే తాను తన జీవితం విస్తరించిందని, విజృంభించిందని, ఖ్యాతి గడించిందని ‘గుర్తు’ పెట్టుకోడం అవసరం.ఆ జన్మకు కారకులైన వారిని మనస్సులోనైనా కనీసం ‘కృతజ్ఞత’ చెల్లించుకోవాలి. 

 

 

తనను పెంచిన వారిని తన ఉన్నత స్థితికి కారకులైన వారిని ఆదరించాలి. వారిని పసి పిల్లలుగ ప్రేమించాలి. భద్రత కలిగించాలి. అడుగు నేర్వని తనకి, చేయి ఆసరా యిచ్చిన వారిని, మాటలు నేర్వని తనకు భాష నేర్పిన వారిని,  తినడం తెలియని తనకి ముద్దు ముద్దుగా గోరుముద్దలుగా నోటికి అందించినవారిని,  తీగకు ఆధారం మాదిరిగ ‘శక్తి’ ‘బలం’లేని తనకు ఎత్తుకుని త్రిప్పిన వారిని...! కనీసం వృద్ధాప్యంలో ‘ఓపిక’లేని వయస్సులోనైనా వారి ‘బరువు’  భరించి ఋణం తీర్చుకోవాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: