ఆడవాళ్లకి ఎత్తు చెప్పులు ధరించాలంటే మహా ఇష్టం. హైహీల్స్, పెన్సిల్ హీల్, షూస్ అని చాలా  రకరకాల చెప్పులు వచ్చాయి.  ఇవి చూడ్డానికి చాలా బాగుంటాయి. కానీ ఇలాంటివి ఎక్కువ సేపు ధరించటం వల్ల మడమలు విపరీతమైన నొప్పి వస్తాయి. ఎత్తు చెప్పులను వేసుకోవడం వల్ల కాళ్ళ నొప్పులు, ఆ తర్వాత కీళ్ళ నొప్పులు కూడా వచ్చే ప్రమాదము ఉంటుంది

 

. కొన్ని చెప్పులు వల్ల ఒత్తిడి పెరిగి బొటన వేళ్ళు వంకర పోవడం, మోకాళ్ల నొప్పులు, కీళ్లు మరియు కాలి మడమలు అరిగిపోవడం, నరాలు తొలిగిపోవడం, పాదాలు దెబ్బతినడం గోళ్ల ఇన్ ఫెక్షన్ రావడం వంటి ప్రమాదాలున్నాయని ఆర్థోపిడిషియన్స్ అంటున్నారు. ఇలాంటి చెప్పులను వేసుకొని ఎక్కువసేపు నడిచినా, ఎక్కువసేపు నిలబడి ఉన్నా కీళ్ళ నొప్పులతో పాటు నడుమునొప్పి వచ్చే ప్రమాదం ఉంది. పెన్సిల్ హీల్ వంటి వాటితో జారిపడి కాళ్ళు ఫ్యాక్చర్ అయ్యే అవకాశం ఎక్కువ. అయితే చాలామంది ఇవి వేసుకోవడానికి కష్టాంగా ఉన్నా వాటినే వేసుకుంటారు. కొన్ని చిట్కాలు పాటిస్తే ఎక్కువ సేపు వాటిని వేసుకోవచ్చు. ఏత్తు చెప్పులు కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

 

వాటిని వేసుకొని ఎక్కువ సేపు నించో గలమా లేదా అన్నది చూసుకోవాలి. మీ మడమలకు సౌకర్యవంతంగా ఉండాలని మీరు కోరుకుంటే సరైన రకమైన ఎత్తు చెప్పులను కొనుగోలు చేయాలి. చెప్పులు కొనేటప్పుడు బెల్ట్ ఉండే విధంగా చూసుకోండి. మహిళలు ఎక్కువ పెన్సిల్ మరియు సన్నగా ఉండే హై హీల్స్ ఎక్కువగా వేసుకుంటారు. ఎందుకంటే అవి అందంగా, స్టైలిష్‌గా ఉంటాయి. కానీ వాటిని ధరించడం వల్ల మడమలుకు నొప్పిని కలిగిస్తాయి.అందుకే మీరు బ్లాక్ హీల్స్ మరియు వెడ్జెస్ వంటివి కొనుగోలు చెయ్యండి. ఇవి మీ పాదాలపై ఒత్తిడిని తగ్గిస్తాయి.. కొత్తలో చెప్పులు కాస్త టైట్ ఉంటాయి దీని వల్ల కాలి పై మచ్చలు పడే అవకాశం ఉంది. అందుకే కొత్త చెప్పులను ధరించే ముందు కొంచెం వాటిని స్ట్రెచ్ చెయ్యండి.

 

మందపాటి సాక్స్ మీద వాటిని ధరించి కొంత సమయం చుట్టూ నడవండి. ఈ చిట్కా మడమలను సౌకర్యవంతంగా చేస్తుంది. ఎత్తు చెప్పులను ప్రతి మహిళా ఇష్టపడతారు. కానీ వాటిని రెగ్యులర్ గా వేసుకోవటం అంత మంచిది కాదుఎత్తు చెప్పులు వేసుకునేవారు పాదాలకు తగిన వ్యాయామం అవసరం. హై హీల్స్ వేసుకునే ముందు పాదాలను స్ట్రెచ్‌ చేయడం మంచిది. పాదం అడుగున బంతిని ఉంచి దానిపై పాదం పెట్టి ప్రెజర్‌తో నొక్కుతూ బంతిని గుండ్రంగా తిప్పాలి. ఇలా చేస్తే కండరాలు వదులుగా అవుతాయి. అందువల్ల హై హీల్స్ వేసుకున్నా ఎలాంటి నొప్పి లేకుండా హాయిగా ఉండొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: