మాతృత్వం ఆడజన్మకు ఓ వ‌రంగా ఫీల్ అవుతారు. ఇక గర్భవతి అని తెలిసిన క్షణం నుంచి పుట్టబోయే బిడ్డను గూర్చి ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. త‌న బిడ్డ ఆరోగ్యంగా, అందంగా పుట్టాల‌ని కొరుకుంటుంది. ఈ క్ర‌మంలోనే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే గ‌ర్భ‌వ‌తి తీసుకోవాల్సిన జాగ్ర‌త్తులో ముఖ్య‌మైన‌ది ఆహారం. గర్భవతి తీసుకొనే ఆహారం పుట్టబోయే బిడ్డ బరువు పై ప్రభావం చూపుతుంది. కనుక గర్భం దాల్చిన ప్రతి యువతి కూడా తన రోజువారీ భోజనపు అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉన్నద‌ని అంటున్న నిపుణులు. మ‌రియు గ‌ర్భ‌వ‌తి మ‌హిళ‌ భోజనంలో సరైన పోషకాలు ఉండేలా చూసుకోవడం చాలా అవ‌స‌రం.

 

అలాగే ప్రెగ్నెన్సీ మ‌హిళ‌లు తొమ్మిద‌వ నెల చాలా కీల‌కం. ఎందుకంటే ఇది డెలివరీ సమయం. బిడ్డ పూర్తిగా ఎదిగిపోయి ఉంటుంది. ఆ పసికందు ఎప్పుడు తన కళ్ళ ఎదుట పడుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటుంది తల్లి. ఆమె మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటుంది. అందుకే ఈ నెల‌లో ప్ర‌త్యేక‌మైన డైట్ పాటించాలి. మ‌రి దానిపై చాలా మంది అవ‌గాహ‌న లేక‌పోవ‌చ్చు. అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్‌ను ఫాలో అవ్వండి. తొమ్మిదవ నెల‌లో మెటబాలిజంలో తేడాలొస్తాయి. మెటబాలిజం రేటు స్టడీగా ఉండాలంటే ఫైబర్ చాలా అవసరం. 

 

అందుకోసం ఫైబర్ బాగా దొరికే ఆపిల్, ఖర్జూరా, బ్రోకొలి, పీస్, బీన్స్, అవకాడో తీసుకోవాలి. అలాగే ఈ నెలలో వైట్ రైస్‌కు బ‌దులుగా తృణధాన్యాలతో చేసిన బ్రెడ్ తినిపిస్తే ఆ ప్రెగ్నెన్సీ మ‌హిళ‌ల‌కు చాలా మంచిది. అదేవిధంగా, తొమ్మిదో నెల‌లో విటమిన్ ఏ ప్రెగ్నెన్సీ మ‌హిళ‌ల‌కు చాలా అవసరం. అందుకోసం గ్రీన్ వెజిటబుల్స్ ని డైట్ లోకి తీసుకోవాలి. బిడ్డ పుట్టుక లోపాలతో ఉండకుండా ఫోలిక్ ఆసిడ్ ఉన్న ఆహారాలు, అంటే గ్రీన్ వెజిటబుల్స్, స్పినాబిఫోడా, బీన్స్ అవసరం. విటమిన్ సి కూడా శరీరానికి అవసరం. కాలిఫ్లవర్, ఆరెంజ్, నిమ్మ, బ్రికోలి, స్ట్రాబెరిలో విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. కాబ‌ట్టి వీటిని కూడా డైట్‌లో చేర్చుకోండి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: