ఇవాంక ట్రంప్ త‌ప్పు చేసింది. క‌రోనా విష‌యంలో ఎంతో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన అమెరికా అధ్య‌క్షుడి త‌న‌య లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించేసింది. అందులోనూ అమెరికాలో మ‌ర‌ణ‌మృందంగా మోగిస్తున్న క‌రోనా హాట్‌స్పాట్ కేంద్ర‌మైనా న్యూయార్క్‌సిటీలోకి ప్ర‌యాణం చేసింది.  వాస్త‌వానికి అమెరికాలో అధ్య‌క్ష‌స్తాయి నుంచి సామాన్యుడి వర‌కు లాక్‌డౌన్ అమ‌లుపై ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. ప్రజలతోపాటూ... రాజకీయ నేతల ప్రయాణాలు, పర్యటనలపై నిషేదాజ్ఞలు ఉన్నాయి. అయితే  ఇవాంక మాత్రం... తన భర్త, ఫ్యామిలీ సభ్యులతో కలిసి... వాషింగ్టన్ నుంచి... న్యూజెర్సీ వ‌ర‌కు ప్ర‌యాణం చేయ‌డం ఇప్పుడు వివాదాస్ప‌దం అవుతోంది.

 

 యూదుల పండుగ పాసోవర్‌‌లో పాల్గొనడానికి ఆమె కొన్నిరోజుల కిందట అక్కడకు వెళ్లారని వైట్‌హౌస్ వర్గాలు చెబుతున్నాయి. న్యూజెర్సీలోని బెడ్‌మినిస్టర్‌లో జరిగిన పాసోవర్‌ ఫంక్షన్‌లో ఆమె కుటుంబ‌స‌భ్యుల‌తో క‌ల‌సి పాల్గొన్నారు. ఇవాంకా వ్య‌వ‌హ‌రించిన తీరుపై అమెరికా ప్రజ‌ల నుంచి విమ‌ర్శ‌లు ఎక్కువ‌వుతున్న వేళ వైట్‌హౌస్ వ‌ర్గాలు చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టాయి. ఇవాంకా త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లోనే  న్యూజెర్సీకి వెళ్లాల్సి వ‌చ్చింద‌ని పేర్కొంటున్నాయి. అంతేకాక అధికారుల సూచ‌న మేర‌కు ఆమె సామాజిక దూరం పాటిస్తున్నారని... అధికార వర్గాలు తెలిపాయి.

 

 ప్రస్తుతం ఇవాకం... ఆ వేడుకల నుంచే అధికార విధులు చేపడుతున్నారు. ఆమె భర్త కుష్నెర్‌ మాత్రం ట్రంప్‌కి సహాయపడేందుకు వైట్‌హౌస్ తిరిగొచ్చారని తెలిపింది.  ఇదిలా ఉండ‌గా చాలా మంది సోషల్ డిస్టాన్స్ అంటే... ఓ 2 అడుగులు దూరంగా ఉంటే చాలని అనుకుంటున్నారు. కానీ తాజా అధ్య‌య‌నంలో దిమ్మ‌తిరిగే నిజాలు వెల్ల‌డ‌వుతున్నాయి. అదేమంటే కరోనా వైరస్.... 13 అ‌డుగుల దూరం వరకూ కూడా గాలిలో ప్ర‌యాణం చేస్తూ వ్యాప్తి చెందుతున్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. ఎవరైనా తుమ్మినా, దగ్గినా... ఆ తుంపర్లు... 13 అడుగుల దూరం వరకూ వెళ్లగలుగుతున్నాయ‌ట‌. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: