లాక్‌డౌన్‌తో దేశ‌మే స్తంభించిపోయింది. లాక్‌డౌన్ అమ‌లుతో ఎక్క‌డివాళ్లు అక్క‌డే చిక్కుకుపోవ‌డంతో చిత్ర‌విచిత్రమైన సంఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ త‌ర‌హాలోనే బీహ‌ర్ రాష్ట్ర రాజ‌ధాని పాట్న‌లో ఓ వ్య‌క్తి త‌న భార్య పుట్టింటి నుంచి రావ‌డం లేద‌ని త‌న మాజీ ప్రియురాలిని వివాహమాడాడు. పాట్నాలోని దుల్హిన్ బజారుకు చెందిన ఓ యువతికి పాలీగంజ్‌కు చెందిన ధీరజ్‌కుమార్‌తో కొన్ని నెలల క్రితం పెద్ద‌లు వివాహం జ‌రిపించారు. అయితే లాక్‌డౌన్‌కు ముందు యువతి త‌న‌ పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం లాక్‌డౌన్ నిబంధనలు అమలులోకి రావడంతో ఆమె పుట్టింటి వద్దే  చిక్కుకుపోయింది. 


లాక్‌డౌన్ సుదీర్ఘంగా కొన‌సాగుతుండ‌టంతో ధీర‌జ్‌కుమార్ ఎలాగోలా వ‌చ్చేయ‌మ‌ని భార్య‌కు చెప్పాడు. అయితే వాహ‌నాలేవీ న‌డ‌వ‌డం లేద‌ని, బ‌య‌ల్దేరితే ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌ని చెప్పేసింది. దీంతో ఆగ్ర‌హించిన భ‌ర్త  తన మాజీ ప్రియురాలిని రెండో వివాహం చేసుకున్నాడు. స్థానికుల ద్వారా ఈవిష‌యం తెలుసుకున్న స‌ద‌రు యువ‌తి భ‌ర్త‌తో మాట్లాడింది. మ‌ళ్లీ వివాహం చేసుకున్న‌ది నిజ‌మేన‌ని నిర్ధారించుకున్నాకా వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు ధీర‌జ్‌కుమార్‌తో పాటు రెండో వివాహం చేసుకున్న మ‌హిళ‌ను అదుపులోకి తీసుకున్నారు. రెండో వివాహం చెల్ల‌ద‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు.


ఇదిలా ఉండ‌గా ఇప్ప‌ట్లో లాక్‌డౌన్ ఎత్తివేసే ప‌రిణామాలు క‌న‌బ‌డ‌టం లేద‌ని ప‌లువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతుండ‌టం గ‌మ‌నార్హం. అయితే క‌రోనాను ఇంటి నుంచి ఎదుర్కొవాల‌ని ప్ర‌ధాన‌మంత్రి  ప‌దేప‌దే పిలుపునిస్తున్నారు. కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల్లో... దేశ ప్రజలను ఉద్దేశించి... లైవ్ ప్రసంగాలు చెయ్యడమే కాదు... ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా... తన అభిప్రాయాలు, ఆలోచనలను ప్రజలతో పంచుకుంటున్నారు. అందులో భాగంగా... వివిధ రంగాల్ని టచ్ చేస్తూ... వాటి సేవల్ని మెచ్చుకుంటున్నారు. 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: