గ‌ర్భం దాల్చ‌డం అనేది మహిళ జీవితంలో ముఖ్య ఘట్టం అడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ సమయంలో ప్రతి మహిళ కూడా ఎన్నో అనుభూతులను పొందుతుంది. అయితే స్త్రీలు గ‌ర్భం దాల్చిన త‌ర్వాత ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంది. ఎందుకంటే మ‌నం చేసే ప‌నులు, తీసుకునే ఆహారం క‌డుపులోని బిడ్డ‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. మ‌రోవైపు ప్రెగ్నెన్సీ టైమ్‌లో ప్రతి మహిళ శరీరంలో మార్పులు కచ్చితంగా ఉంటాయి. శరీరంలో జరిగే హార్మోనుల మార్పుల కారణంగా ఆరోగ్యపరంగానే కాదు, అందం విషయంలో కూడా మార్పులు జరగడం సహజం. 

 

ఇక ప్రెగ్నన్సీ వచ్చాక ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ ఎదుర్కొనే సాధారణ సమస్య వికారం, వాంతులు. ఈ స‌మ‌యంలో వాంతులు రావ‌డం స‌ర్వ సాధార‌ణంమే.
కానీ, వీటి వ‌ల్ల ప్రెగ్నెన్సీ స్ట్రీ ఎలా నీర‌సంగా మారిపోతారు. కొంతమందికి గర్భం పొందిన ప్రారం దశలో ఈ సమస్యను ఎదుర్కుంటే,మరికొంత మంది, గర్భధారణ చివరి నెలల్లో ఎదుర్కుంటుంటారు. అయితే ఈ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టాలంటే కొన్ని సింపుల్ టిప్స్ ఉప‌యోగిస్తే మంచిది. అందులో ముందుగా  వికారం, వాంతులు, కడుపు ఉబ్బరం, జీర్ణ సంబంధ వ్యాధుల చికిత్సకు ఉత్తమ నివారణగా అల్లం పనిచేస్తుంది. 

 

తాజా అల్లం ముక్కను నమలడం లేదా అల్లం టీ తీస్కోవడం వంటివి చేయవచ్చు. అయితే ప్రెగ్నెన్సీ మ‌హిళ‌లు దీన్ని చాలా త‌క్కువ‌గా తీసుకోవాలి. అలాగే ప్రెగ్నన్సీ సమయంలో నీళ్లు తగినన్ని తాగాలి. డీహైడ్రేషన్ కారణంగా కూడా వాంతులు అవుతాయి. కాబట్టి ఒకే సారి ఎక్కువ నీళ్ళు తాగకుండా అప్పుడప్పుడు కొద్దికొద్దిగా రోజంతా తాగాలి. అదేవిధంగా, నిమ్మరసంలో వికారాన్ని కలిగించే ఆమ్లాలను త‌గ్గించే గుణాలు పుష్క‌లంగా ఉన్నాయి. మ‌రియు ఇవి వికారం నుండి ఉపశమనాన్నిచ్చే బైకార్బోనేట్ సమ్మేళనాలను విడుదల చేస్తాయి. కాబ‌ట్టి.. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో, నిమ్మరసం, చిటికెడు ఉప్పు వేసి కలిపి తీసుకుంటే ఉత్త‌మం.

  

మరింత సమాచారం తెలుసుకోండి: