సాదరంగా ఎక్కువ మహిళలు వాళ్ల అందం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంటారు. ఇందులో భాగంగానే చాలా రకాల టిప్స్ ను ఉపయోగిస్తుంటారు. ఆ టిప్స్ వాడడం ద్వారా  అందాన్ని పొందాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక గర్భధారణ సమయంలో మహిళలకు ఎక్కువ శాతం తొడలు, రొమ్ము, పొట్టపై స్క్రాచ్స్ వస్తాయి. అంతేకాకుండా ఒక్కసారిగా లావుగా ఉన్నవారు సన్న పడితే కూడా స్క్రాచ్ మార్కులు వస్తాయి. వాస్తవానికి మహిళలు ఇవి పోగొట్టు కోవడానికి చాలా రకాల మందులు ఉపయోగిస్తుంటారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రయోజనం ఉండదు. ఇలా వచ్చిన మార్పులను తొలగించడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.. అది ఏంటో ఒకసారి తెలుసుకుందామా మరి...

 


1. శరీరంలో స్క్రాచ్ మరకలు ఉన్నచోట రోజు నిమ్మకాయ మర్దన చేసుకోవాలి. దీనితో నిమ్మకాయలో ఉన్న బ్లీచింగ్ లక్షణాల ద్వారా ఆ గుర్తులు చాలా త్వరగా తగ్గిపోతాయి.

 

2. బాదం నూనె లేదా కొబ్బరి నూనె స్క్రాచ్ మరకలు ఉన్న ప్రదేశంలో మసాజ్ చేసుకుంటే దానితో స్క్రాచ్ మరకలు సులువుగా తగ్గించుకోవచ్చు.

 

3. ఇక బంగాళాదుంప రసం ప్రతిరోజు ఈ రసాన్ని స్క్రాచ్ మరకలు ఉన్న ప్రదేశంలో రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వాస్తవానికి ఇందులో పిండి పదార్థాలు బాగా దొరుకుతాయి. దీనితోపాటు ఇందులో చర్మం లైటనింగ్ ఎంజైమ్ లు ఉండడం ద్వారా త్వరగా సహాయపడుతుంది.

 

4  కలబందలో సహజ వైద్యం ద్వారా బాగా పనిచేస్తుంది. ఇక స్క్రాచ్ మరకలు ఉన్న ప్రదేశంలో కలబంద గుజ్జును పూసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చర్మం మృదువుగా మారడానికి సహాయపడుతుంది.

 

5. నిజానికి మహిళలు చర్మాన్ని తెల్లబరిచుకునేందుకు గుడ్డు సోనా సహాయపడుతుంది. ఇందులో మాంసకృత్తులు, అమైనో ఆమ్లం ఎక్కువగా లభించడంతో స్క్రాచ్ మరకలు సులువుగా తగ్గించుకోవచ్చు. 

 

6. ఆలివ్ ఆయిల్ లో తేమ లక్షణాలు ఎక్కువ శాతం ఉంటాయి. అంతే కాకుండా ఇది యాంటీ ఆక్సిడెంట్ లాగా కూడా సహాయపడుతుంది. దీనితో స్క్రాచ్ మరకలపై ఆలివ్ ఆయిల్ పూసుకోవడం వల్ల మరకలు సులువుగా తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: