కొంత మందికి చిన్నవయస్సులోనే జుట్టు తెల్లబడు తుంది. అప్పట్లో  50 సంవత్సరాలు కి జుట్టు తెల్లబడేది. కానీ ఇప్పుడు వయసు తో సంబంధం లేకుండా జుట్టు తెల్లబడుతుంది. ఆడవాళ్ళకి కూడా తెల్లజుట్టు సమస్య ఎక్కువ ఉంది. దీనివల్ల ముసలి వాళ్ళం అయ్యాము అనే ఫిలింగ్ లో ఉండాలిసిన పరిస్థితి వస్తుంది. అయితే తెల్ల జుట్టు రావడానికి  అనేక కారణాలు ఉన్నాయి.

 

ముఖ్యంగా వంశపారంపర్య లక్షణాల మూలంగా కూడా జుట్టు తెల్ల బడే అవకాశాలు అధికంగా ఉన్నాయి.ఆహారలోపాలు, ఒత్తిడి వంటివన్నీ దీనికి కారణం.ఇక నేటి వాతావారణ కాలుష్యం కూడా దీనికి ఓ కారణం.తీసుకునే ఆహారంలో లోపాలు, థైరాయిడ్‌ సమస్య, మా నసిక ఒత్తిడి, ఆందోళన, రకరకాల షాంపూలు వాడడం వంటివి పలు కారణాలు కావచ్చు.వీటిలో ఏ కారణం వల్ల మీ జుట్టు తెల్లబడుతుందో ముందుగా గుర్తించాలి.

 

వంశపారం పర్యం, థైరాయిడ్‌ సమస్యల మూలంగా జుట్టు తెల్లబడుతుందానుకుంటే వెంటనే ట్రైకాలజిస్ట్‌ లేదా ఎండో క్రైనాలజిస్ట్‌ వైద్య నిపుణులను సంప్రదిం చాలి. చదువుకునే విద్యార్థులకు జుట్టు తెల్లబడుతుం దంటే వారికి చదువు ఒత్తిడి అధికంగా ఉందనుకోవచ్చు.పరీక్షలకు సంబంధించిన ఒత్తిడి, ఆందోళన వంటివి విద్యార్థుల్లో జుట్టు తెల్లబడడానికి కారణమవుతాయి.ఇటువంటపుడు కౌన్సిలింగ్‌ ద్వారా ఒత్తిడిని తగ్గించుకునే అవకాశాలున్నాయి.

 

ఇక తీసుకునే ఆహారంలో లోపాలు కూడా తెల్లజుట్టు రావడానికి కారణమవుతాయి.ప్రతిరోజూ మంచి పోష కాహారం తీసుకోవాలి.పాలు, గుడ్లు, మొలకెత్తిన విత్త నాలు, సోయాజాతి విత్తనాలు, డ్రైప్రూట్స్‌ వంటివి ఎక్కు వగా తీసుకుంటే కొంతవరకు ఉపయోగం ఉంటుంది.ఘూటైన షాంపూలను వాడరాదు.ఎప్పు డు ఒకే రకమైన షాంపూను వాడడం మంచిది. మార్కెట్లోకి కొత్తగా ఏవీ వస్తే వాటిని వాడడం సరికాదు.గుడ్డు తెల్లసొన లేదా మజ్జికతో కలిపి రుబ్బిన కరివేపాకు లేదా మెంతి ఆకు పేస్టుల్ని తలకు ప్యాక్‌గా వేసుకోవాలి.మందారాకు పేస్ట్‌తో కూడా ప్యాక్‌ చేసుకోవచ్చు.హెర్బల్‌ హెన్నాలో బీట్‌రూట్‌ రసాన్ని కలిపి ప్యాక్‌ వేసుకున్నా జుట్టుకు మంచి రంగు వస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: