మ‌హిళ‌ల‌కు కాటుకే అందం.. మ‌హిళ‌లు కాటుక లేకి క‌ళ్ల కంటే.. కాటుక‌తో ఉన్న క‌ళ్ల‌ను చూస్తే ఆ కాంతి వేరుగా ఉంటుంది. అందుకే సినిమాల్లో సైతం కాటుక క‌ళ్ల‌ను చూస్తే అని నాటి నుంచి నేటి వ‌ర‌కు ఎన్నో పాట‌లు వ‌చ్చాయి. ఇక కాటు క వ‌ల్ల క‌ళ్ల‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. కాటుక‌తో క‌ళ్ల‌కు అందం రావ‌డంతో పాటు కాటుక పెట్టుకున్న మ‌హిళ మొఖానికే ఎక్క‌డా లేని అందం వ‌స్తుంది. కాటుక వ‌ల్ల అందంతో పాటు ఉన్న ప్ర‌యోజ‌నాలు ఇలా ఉన్నాయి.

 

- కాటుక ఎండ, దుమ్ము, ధూళి ప్రభావాల నుంచి కంటిని కాపాడటమేకాకుండా కండ్లను తాజాగా, మెరిసేలా చేస్తుంది. 

మంగళ ద్రవ్యమైన కాటుక ధారణ సుమంగళత్వాన్ని ప్రసాదిస్తుందన్న నానుడి మ‌న‌కు పురాత‌న కాలం నుంచి ఉంది. అందుకే చాలా మంది పెద్ద‌లు నేటి త‌రం అమ్మాయిల‌కు కాటుక పెట్టుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను చెపుతూ ఉంటారు.

- కాటుక వ‌ల్ల కళ్ల‌కు చాలా చల‌వ ఉంటుంద‌ట‌. మ‌న క‌ళ్లు ఎక్కువ సేపు ఏదైనా ప‌నిమీద ఏకాగ్ర‌త‌తో ఉన్న‌ప్పుడు కాస్త అలిసిపోతాయి. వేడి చేసిన‌ప్పుడు కూడా క‌ళ్ల వెంట నీళ్లు వ‌స్తాయి. అందుకే కాటుక పెట్టుకుంటే కంటికి చలువ చేస్తుందని ఆయుర్వేదమూ చెబుతున్నది. 

- నాణ్యమైన కాటుక వాడాలి. కాటుక వాడినప్పుడు దురద పెట్టటం, కళ్ళు మంటగా అనిపిస్తే వెంటనే కాటుక వాడటం ఆపాలి. 

- ఎక్కువగా చెమట పెట్టే చర్మంగలవారు, ఉక్కపోతగా ఉన్నప్పుడు కాటుక పెట్టుకునేవారు ముఖాన్ని ఐస్‌ ముక్కలతో మర్దన చేసుకోవాలి. దీనివల్ల చెమట పట్టడం తగ్గి కాటుక చాలా సేప‌టి వ‌రకు చెక్కు చెద‌ర‌కుండా ఉంటుంది.

 

- కాటుక పెట్టుకొనే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని కండ్లపై తడిలేకుండా తుడుచుకోవాలి. కాటుక పెట్టుకునే ముందు మెత్తని వస్త్రంతో కనురెప్పను తుడుచుకోవాలి. దీనివల్ల కనురెప్పలపై ఉండే జిడ్డు పూర్తిగా తొలగిపోతుంది. 

- కాటుక పెట్టుకున్నాక కొద్దిగా పౌడర్‌ కళ్ల చుట్టూ రాస్తే చర్మంపై ఉండే జిడ్డుని పౌడర్‌ పీల్చుకొని కళ్లు తాజాగా ఉంటాయి. కనురెప్పల కోన భాగంలో కాటుక పెట్టుకొంటే చెరిగిపోయే అవకాశం ఎక్కువ గనుక కనురెప్పల మధ్యన కాటుక పెట్టుకోవాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: