శృంగార‌మ‌నేది ప్ర‌తి మ‌నిషి జీవితంలో ఉండేదే. అయితే అందులో ఒకొక్క‌రికి ఒక్కోర‌క‌మైన ఇంట్ర‌స్ట్ ఉంటుంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు శృంగార సామ‌ర్ధ్య‌మ‌నేది మ‌గ‌వారిలో ఎక్కువ‌గా మ‌నం ఆ ప్రాబ్ల‌మ్ గురించి విన్నాం. అయితే దానికి సంబంధించి వ‌య‌గ్రా మాత్ర‌లు ప‌నికొచ్చేయి. అయితే ఇప్పుడు ఈ మాత్ర‌లు మ‌హిళ‌ల‌కు కూడా అందుబాటులోకి వ‌స్తున్నాయ‌ట‌. 

 

మహిళలు తమ శృంగార సామ‌ర్ధ్య‌న్ని పెంచుకునేందుకు రోజా రంగులో ఉండే  మాత్రలు ఉపయోగపడతాయంటున్నారు. అయితే  ప్రయోగాల అనంతరం ఈ మాత్రలను మహిళలకు సిఫార్సు చేసేందుకు ఆహార, ఔషధాల నిర్వహణ కమిటీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇదిలా ఉంటే ఈ మాత్ర‌లు అమ్మేందుకు జ‌న‌ర్మ‌నీ ఫార్మ‌సీ కంపెనీల్లో ఓ ప్ర‌ముఖ కంపెనీ ఆశ‌క్తిని చూపుతుంద‌ని స‌మాచ‌రం.  "ఫిల్బాసెరిన్"గా పిలిచే ఈ మాత్ర మహిళ మెదడులో సెక్స్ కోర్కెలను రేపి భాగస్వామితో శృంగారాన్నిజ‌రిపేందుకు ఆజ్యం పోస్తుంది.

 

అంతేకాక ఈ మాత్రను మార్కెట్లో విడుదల చేయాలని  ఆరోగ్య, ఔషధాల నిర్వహణ కమిటీ స‌మావేశ‌మ‌యి నిర్ణ‌యం తీసుకోనుంది. ఈ సమావేశంలో మాత్రలను బహిరంగ మార్కెట్లలో అందుబాటులోకి తెచ్చే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఈ విష‌యం పై వాషింగ్‌ట‌న్‌‌లోని మహిళా ఆరోగ్య సంస్థ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. సుఖమైన, ఆరోగ్యకరమైన సెక్స్ జీవితాన్ని ఆస్వాదించే అవకాశం మహిళకు కల్పించడం అభినందించదగ్గదే అయినప్పటికీ ఈ మాత్రలు వారి ఆరోగ్యంపై ఎటువంటి ప్ర‌భావం చూపిస్తుంది ఏమిట‌న్న దాని పై పూర్తిగా నిగ్గు తేల్చాలని కోరింది. హానిరహితమైనవని తేలిన తర్వాతే ఈ మాత్రల విక్రయానికి అనుమతివ్వాలని ఆ మ‌హిళ ఆరోగ్య నిపుణుల‌కు సూచించింది. అయితే ఇది మంచి విష‌య‌మే అని ప‌లువురు భావిస్తున్నారు. ఏమాత్రం ఆ మాత్ర‌లు చెడు ప్ర‌భావం చూపించినా దాని వ‌ల్ల లేనిపోని ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయ‌ని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: