బరువు తగ్గాలి అనుకునేవారికి చాలామంది చాలా చిట్కాలు చెబుతూ ఉంటారు బరువు తగ్గడానికి ఈ పని చేయండి ఆ పని చేయండి అంటారు 

 

ఆరోగ్యంగా బరువు తగ్గడం అనేది క్రమంగా జరిగే ప్రక్రియ మీ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా సులువుగా బరువు తగ్గించే  కొన్ని  చిట్కాలు ఉన్నాయి..మీ ఆహారంలో ఎక్కువ పీచు పదార్థాలను ఉండేటట్టుగా చూడండి దీని వల్ల  మీరు తక్కువ కేలరీల తీసుకోవడానికి సహాయపడుతుంది పీచుపదార్థాలున్న ఆహారం బరువు తగ్గడానికి సిఫార్సు చేయబడింది.

 

రోజుకు 30 గ్రాములు పీచు పదార్థాలు తినాలి. కార్బోహైడ్రేట్లు చాలా మంది ఆహారంలో ప్రధానమైనవి. చక్కెర లు ఎక్కువ ఉన్న కార్బోహైడ్రేట్ ఆహారంని ఇష్టపడతారు.  వాస్తవానికి, ఒక గ్రాము కార్బోహైడ్రేట్ నాలుగు కేలరీలను కలిగి ఉంటుంది ఇది బరువు పెరిగే సమస్యను అధికం చేస్తుంది. 

 

మీరు బరువు తగ్గాలంటే కార్బోహైడ్రేట్ ఆహారాన్ని తగ్గించి. ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం మంచిది.జంక్ ఫుడ్స్ లో అనారోగ్య లేదా సంతృప్త కొవ్వులు ఉంటాయి కాబట్టి బయట లభించే జంక్ ఫుడ్ అలాగే నూనె పదార్థాలు తో చేసే బజ్జీలు వంటి తినడం మానేయాలి. చిన్న చిన్న మార్పులే చాలా ప్రభావం చూపుతాయి ఉదాహరణకి ఎలివేటర్‌కు బదులుగా మెట్లు ఎక్కండి. దగ్గర్లోలో షాపింగ్ వెళ్లాల్సిన అప్పుడు బైక్ కార్ బదులుగా 30 నిముషాలు నడుచుకుంటూ వెళ్లి హాయిగా షాపింగ్ చేసి రండి. కొద్దిగా వ్యాయామం మంచిది. క్రమం తప్పకుండా వ్యాయామం కేలరీలను తగ్గించడానికి సహాయపడుతుంది. బయట లభించే ఆహార పదార్థాలు ఎక్కువగా నెయ్య డాల్డా మరియు నాసిరకమైన నూనెను వాడుతూ ఉంటారు వీటివల్ల మీరు బరువు అధికంగా పెరుగుతారు .మీ స్వంత భోజనం వండుకోవడం చాలా ముఖ్యమైనది.త్రాగునీరు బరువు తగ్గడానికి సహాయపడుతుందని తరచూ చెబుతారు. ఇది నిజం.

 

మీ ఆరోగ్యానికి తగినంత నీరు త్రాగటం చాలా ముఖ్యం.చాలామంది ఉదయాన్న టిఫిన్ తిన్నారు హ ఏముందిలే టిఫిన్ తినకపోతే బరువు తగ్గొచ్చు అని అనుకుంటారు కానీ ఇది చాలా పొరపాటు టిఫిన్ తినకపోతే బరువు తగ్గడం కాదు బరువు పెరుగుతారు , మీరు టిఫిన్ తినకపోతే మీరు భోజనం చేసే సమయానికి ఇంకా ఎక్కువ ఆకలేసి ఇక కేలరీల ఉన్న ఆహారాన్ని తింటారు.ఎక్కువ కేలరీలు ఉన్న పూరి లాంటివి తినకుండా బరువు తగ్గడానికి సహాయపడే ఉడికించిన కోడి గుడ్డుని తినడం మంచిది.

 

చిన్న ప్లేట్లు ఉపయోగిస్తే మనం తక్కువ ఆహారం ప్లేట్ లో పెట్టుకున్న ఎక్కువ ఆహారం ఉన్నట్లు అనిపిస్తుంది దీనివల్ల మీరు తక్కువ ఆహారం తినడానికి అవకాశం ఎక్కువ ఉంది

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: