సాధార‌ణంగా పెళ్లైన ప్రతి స్త్రీ జీవితంలో తల్లయ్యే దశ చాలా ఉత్సాహాన్ని, ఆనందాన్ని అందిస్తుంది. ఆ ఆనందం, ఉత్సాహం కేవ‌లం ఆ మ‌హిళ‌కు మాత్రం తెలుస్తుంది. అందులోనూ మొదటిసారి తల్లి కాబోతుంటే, అన్ని విషయాలు చాలా ఆశ్చర్యకరంగా అన్పిస్తాయి. ఇక అమ్మతనం పొందిన దగ్గర్నుండి ప్రసవ సమయం వరకు బిడ్డ క్షేమం కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రతి స్త్రీ అమ్మగా తన జన్మ పండించుకోవాలని ఆరాటపడుతుంది. అయితే గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకొనే ప్రతి ఆహారం పుట్టబోయే బిడ్డ పై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఆమె తినే ఆహారం శిశువుకి వెళుతోంది. 

 

కాబట్టి గర్భధారణ సమయంలో స్త్రీలు ఆహార విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌస్టికాహారము అనగా ఎక్కువపాలు, పండ్లు, ఆకుకూరలు, పప్పు, మాంసము, చేపలు వగైరా ఖచ్చితంగా తీసుకోవాలి. అప్పుడు బిడ్డ ఆరోగ్యంగా, అందంగా పుడ‌తాడు. ఇక కేవ‌లం ఆహార జాగ్ర‌త్త‌లే కాకుండా ఇత‌ర విష‌యాల్లో కూడా జాగ్ర‌త్త‌లు వ‌హించాలి. ఇందులో భాగంగా గ‌ర్భిణీ స్త్రీల‌కు పెద్ద‌లు అది చేయ‌కూడ‌దు.. ఇది చేయ‌కూడ‌దు అని ఏదో ఒక‌టి చెబుతూనే ఉంటారు. అయితే వారి మాట‌లు మూఢ‌న‌మ్మ‌కాలుగా అనిపిస్తాయి. కానీ, వాటి వెన‌క ఎన్నో రహ‌స్య‌లు ఉంటారు. ఇందులో భాగంగా ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు చనిపోయిన వారి దగ్గరికి వెళ్లొద్దు అని చెబుతారు. 

 

అయితే దీన్ని చాలా మంది మూఢనమ్మకంగా అని కొట్టిపాడేస్తారు. కానీ, ఇందులో ఉన్న వాస్తవమేంటంటే చనిపోయినవారిని చూస్తే బాధకలగడం కామన్‌గా జ‌రుగుతుంటుంది. ఇది తల్లికీ, బిడ్డకి అంత మంచిది కాదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గర్భంతో ఉన్నప్పుడు తల్లి ఎలా ఫీల్ అయితే బిడ్డపై అలా ఎఫెక్ట్ పడుతుంది. ఎలాంటి విషయంలోనూ ఆందోళన చెందొద్దు. బాధపడొద్దు. గట్టిగా అరవడం, ఏడవడం ఇలాంటి ప్రతికూల ప్రభావాలన్నీ బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. అందుకే గ‌ర్భిణీ స్త్రీలు చ‌నిపోయిన వారి ద‌గ్గ‌రికి వెళ్ల‌కూడ‌దు అని చెబుతుంటారు.

 
  

మరింత సమాచారం తెలుసుకోండి: