ప్రెగ్నెన్సీ అనేది పెళ్లైన ప్ర‌తి మ‌హిళ జీవితంలో ఓ ఆనంద‌క‌ర‌మైన‌, ఉత్సాహ‌క‌ర‌మైన ముఖ్య ఘట్టం అని చెప్పుకోవాలి. ఆ టైమ్‌లో ఆమెకు ఎదుర‌య్యే అనుభూతులు మాట‌ల్లో చెప్ప‌లేనిది. గర్భం ధరించగానే తన గురించి కంటే తన కడుపులోని బిడ్డ గురించే ఎక్కువగా ఆలోచిస్తుంది. తనకు పుట్టబోయే బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాలని అనుకుంటుంది. అయితే ఆ సమయంలో ప్రెగ్నెన్సీ స్త్రీ ఎంత జాగ్రత్తగా ఉంటే అది పుట్టబోయే బిడ్డకి, ఆమెకి అంత మంచిది.  ముఖ్యంగా గర్భిణి నిత్యం తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

 

ఎందుకంటే గర్భధారణ సమయంలో తల్లి తినే చాలా ఆహారాలు తల్లికి మాత్రమే కాదు కడుపు పెరుగుతున్న శిశువుకు కూడా మంచివి. అయితే చాలా మంది ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో ఏం తినాలి..? ఏం తిన‌కూడ‌దు..? అన్న కంగారు ప‌డ‌డం స‌హ‌జం. అలాంటి వారు ప్రెగ్నెన్సీ టైమ్‌లో జామ‌కాయ తినొచ్చా..? తిన‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుంది..? అని ప్ర‌శ్నిస్తుంటారు. వాస్త‌వానికి పరిమిత పరిమాణంలో వినియోగిస్తే ఏదైనా మంచిదే. అది ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. అధిక వినియోగం ప్రాణాంతకం. ఇందుకు జామ‌కాయ కూడా మిన‌హాయింపు కాదు.

 

గర్భధారణ టైమ్‌లో ఐరన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. జామకాయలో ఐరన్ అధికంగా ఉండటం గర్భధారణ సమయంలో హిమోగ్లోబిన్‌ను నిర్మించడంలో సహాయపడుతుంది. తద్వారా రక్తహీనతను నివారించవచ్చు. గర్భిణీ స్త్రీ తనను తాను పోషించుకోవడమే కాదు, తన కడుపులో పెరుగుతున్న పిండానికి కూడా ఆహారం ఇస్తుంది. కాబట్టి గొప్ప పోషకమైన ఆహారం తినాలి. అయితే జామకాయలో అద్భుత పోషకాలు ఉన్నాయి కాబ‌ట్టి.. ప్రెగ్నెన్సీ స్త్రీలు ప‌రిమితి మించ‌కుండా తీసుకోవ‌చ్చు. జామకాయ రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇది గర్భిణీ స్త్రీకి అత్యంత అవసరం. సో.. ఎలాంటి చింత లేకుండా ప్రెగ్నెన్సీ మ‌హిళ‌లు జామ‌కాయ‌లు తిన‌వ‌చ్చు.

 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: