ప్రకృతి మహిళకు ఇచ్చిన గొప్ప వరం అమ్మతనం ఒక బిడ్డకు జన్మనిచ్చి వెంటనే చనుబాలు ఇచ్చి ఆమె ప్రాణం పోస్తుంది తల్లి. బిడ్డ పుట్టిన వెంటనే తల్లి పాలు ఇవ్వడం శ్రేయస్కరం. తల్లిపాలలో ఉండే గొప్పతనం ఆ బిడ్డ సరిగ్గా పెరగడానికి దోహదం చేస్తుంది. అయితే తల్లి బిడ్డకు పాలు  ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి? ఎప్పుడు మానిపించాలి అని చెప్పడానికి సరైన ఆధారాలు ఎక్కడా లేవు!!పుట్టగానే మొదటిసారి వచ్చే ముర్రుపాలలో.. బిడ్డ జీవితాన్ని కాపాడే, రోగ నిరోధక వ్యవస్థను పెంపొందించే ఎన్నో పోషకాలు అందుబాటులో ఉంటాయి.

 

ఎక్కువ ప్రొటీన్లు, తక్కువ చక్కెరలు ఉండే ఈ పాలు బిడ్డకు సులువుగా అరుగుతాయి బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలల్లో కచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలి ఇంకా ఏమి కూడా పెట్టకూడదు తల్లిపాలే వారికి సరిపోతుంది. ఇక ఆరు నెలల తర్వాత బిడ్డ ఎదుగుదల దృష్ట్యా తల్లిపాలు ఇస్తూ ఘన  పదార్థాలు ద్రవపదార్థాలు మెల్లమెల్లగా అలవాటు చేస్తూ ఉండాలి. ఆరు నెలల తర్వాత కేవలం తల్లి పాల వల్ల వచ్చే విటమిన్స్ సరిపోవు. ఇక బిడ్డ సంవత్సరం వచ్చాక మనం తినే ఆహార పదార్థాలు అన్నీ కూడా బిడ్డకు కూడా అలవాటు చెయ్యాలి.

 

బిడ్డకు పాలు మానిపించడం అనేది బిడ్డ ఎదుగుదల ను దృష్టిలో పెట్టుకుని ఆలోచించుకోవాలి. మొదటి ఆరు నెలలు మాత్రం కచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలి. తర్వాత బిడ్డ తల్లి పాలతో పాటు వేరే ఆహారం కూడా స్వీకరిస్తుంటే మానిపించవచ్చు.  కొంతమంది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల వరకు కూడా పాలు ఇస్తుంటారు..బిడ్డ యొక్క ఎదుగుదలని బట్టి పాలు ఇవ్వాలి.. ఒకవేళ తల్లి ఆరోగ్యం సరిగా లేకపోతే పాలు మాన్పించవచ్చు.

 

కొంతమంది ఆడవాళ్లు పిల్లలకు పాలు ఇస్తే అందం తగ్గిపోతుంది అని అభిప్రాయంలో ఉండి పిల్లలకు పాలు సరిగా ఇవ్వరు.. కానీ అలాచేయడం మంచి పద్ధతి కాదు.ముందు మనకు పిల్లల ఆరోగ్యం ముఖ్యం.. మనం ఇచ్చే పాలే పిల్లకు మంచిది.. అన్ని పోషక విలువలు పాలల్లో సమృద్ధిగా ఉంటాయి. మహా అయితే ఒక సంవత్సరంపాటు ఇస్తాము పిల్లలకు పాలు అంతే. బిడ్డకు మొదటి ఆహారం తల్లి పాలే అన్నది ప్రతి తల్లి గుర్తుపెట్టుకోవలిసిన విషయం... 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: