కళ్ల అడుగున ఏర్పడే నల్లని వలయాల్ని పోగొట్టేందుకు ఏవో పూతలు వేసుకోవడమే కాదు. ఈ కొన్ని చిట్కాలు పాటించి చూడండి. చాలా తక్కువ సమయంలో మార్పు కనిపిస్తుంది.

 

 ఆహారంలో ఉప్పును ఎక్కువగా తీసుకుంటున్నా చర్మం తేమను గ్రహించే శక్తి కోల్పోతుంది. చర్మం పొడిబారి కంటి కింద ఉబ్బినట్టు అవుతుంది. కొన్నాళ్ళు ఉప్పు మోతాదు తగ్గించి చూడండి.దిండు గలేబుల్ని ఉతక్కుండా ఎక్కువ రోజులు వాడినా వాటి పై పేరుకున్న క్రీములు చర్మానికి హాని చేయొచ్చు. ముఖ్యంగా కంటి కింది చర్మం నల్లగా ఉబ్బినట్టుగా మారుతుంది. వాటిని కనీసం 15 రోజులకోసారి ఉతకడం మంచిది.

 

ముఖానికి వేసుకున్న మేకప్ తొలగించక పోయినా ఈ సమస్య ఎదురవుతుంది. అలంకరణ సామాగ్రిలోని రసాయనాలు చర్మానికి హాని చేయడమే కారణం. అలంకరణ తొలగించాకా కళ్ల చుట్టూ కొద్దిగా బాదం నూనె రాసి చాలా నెమ్మదిగా మర్దన చేస్తే ఈ సమస్య చాలా మటుకూ ఎదురుకాదు.కళ్ల పై నేరుగా ఎండ పడకుండా చూసుకోవాలి.ఎండలో బయటికి వెళ్లినప్పుడు చలువ కళ్ళద్దాలు పెట్టుకోవడం మంచిది. బయటకి వెళ్లి వచ్చిన తర్వాత చల్లని నీటిలో ముంచిన తువ్వాలును కళ్ల పై కాసేపు ఉంచితే ఉపశమనం ఉంటుంది.కీరదోస ముక్కల్ని స్త్లెసుల్లా కోసి ఫ్రిజ్‌లో ఉంచాలి. బాగా చల్లగా అయ్యాక కళ్లపై పెట్టుకోవాలి. పదిహేను నిమిషాల తరవాత వాటిని తొలగించాలి. ఇది ఎంతో మార్పు తెస్తుంది 

 

  ప్రతిరోజు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోవాలి.కంటికి ఒత్తిడి కలిగించే పనులకు దూరంగా ఉండాలి. అదే పనిగా కంప్యూటర్ ఫోన్లు చూడకూడదు. నిద్ర వల్ల వచ్చే ప్రశాంతతతో కంటి కింద చర్మం పై ఒత్తిడి తగ్గి వలయాలు దూరమవుతాయి.కాటన్ పాడ్స్(పత్తి ఉండలు) తీసుకొని రోజ్ వాటర్ లో కొన్ని నిముషాలు డిప్ చేసి, ఈ కాటన్ బాల్స్ ను మీ మూసిన కళ్ళ(కనురెప్పల) మీద పెట్టుకోవాలి. పది నిముషాల తర్వాత కాటన్ ఉండలు తీసేసి, చల్లటి నీటితో కళ్ళు తుడుచుకోవడం వల్ల కళ్ళ చుట్టూ ఉన్న నల్లటి చర్మం  మారి ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: