గర్భం దాల్చడం అనేది మహిళలకు  దేవుడిచ్చిన గొప్పవరం. గర్భం దాల్చడం, ఒక ప్రాణానికి జన్మనివ్వడం, అమ్మ అని పిలిపించుకోవడం స్త్రీ జన్మని సంపూర్ణం చేస్తాయి. అందుకే తల్లి కావడం అనేది ఒక గొప్ప వరంగా భావిస్తారు. మరి అంత గొప్ప విషయం మీ జీవితంలో జరగబోతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తల్లి కావాలనుకుంటున్నాను అని డిసైడ్ చేసుకోగానే ఆహరం విషయంలో కొన్ని జాగ్రత్తలు మొదలుపెట్టాలి.

 

ముందుగా ఒక న్యూట్రీషన్ ఎక్స్ పర్ట్ ని కలిసి డైట్ ప్లాన్ సెట్ చేసుకోండి.ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బరువు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది . అందుకే ముందు నుంచే ఒక ప్లాన్ వేసుకోవాలి. ఒక్కసారిగా ఎక్కువ ఆహరం తీసుకోవద్దు. మితంగా, డైట్ ని విభజించుకొని తినాలి. ఒక్కసారి ఎక్కువ తింటే కొవ్వు పేరుకుంటుంది. గర్భిణి స్త్రీకి కొవ్వు సమస్యలు ఉండకూడదు. పండ్ల రసాలు తక్కువ తాగాలి. వాటిలో పీచు ఉండదు అందువల్ల షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి.

 

అందుకే పండ్లని అలానే తినడం మొదలుపెట్టండి. పండ్లని బాగా శుభ్రం చేసి తినండి. సాధ్యమైనంత వరకు స్వచ్చంగా పండిన ఫలాలని తెప్పించుకోండి. మీకు అలర్జేటిక్ గా అనిపించే ఆహారాల జోలికి వెళ్ళవద్దు.బాగా ఉడికించి వండిన మాంసాన్నే తినండి. ప్రోటీన్స్ మీకు అవసరం. అలాగే ఫోలిక్ ఆసిడ్ కూడా ఈ సమయంలో అవసరం. గర్భం దాల్చిన తరువాత రక్తహీనత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందు నుంచి ఐరన్ ఉండే ఆహరపదార్థాలపై దృష్టి పెట్టండి. ఆకుకూరలు ఎక్కువ తినండి. ఈ సమయంలో హిమోగ్లోబిన్ శాతం అస్సలు పడిపోకూడదు.

 

అలాగే ఒంటికి ఆక్సిజన్ కూడా ముఖ్యం. ఎముకలు బలంగా ఉండాలి కాబట్టి కాల్షియం ఉండే ఆహారపదార్థాలు తినండి. పాలు మీ రోజు వారి ఆహారంలో భాగం చేయండి. డీ హైడ్రేట్ అవకుండా నీళ్ళు బాగా తాగండి. గ్రీన్ వెజిటబుల్స్ ని డైట్ లో ఉంచుకోండి.ఎక్కువ స్ట్రెస్ గి గురికాకండి. మనసుని ఎప్పుడు ప్రశాంతముగా ఉంచుకోండి. మీ ఆలోచనలన్నీ మీ బిడ్డ మీదే ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉంటే కడుపులో ఉన్న మీ బిడ్డ ఇంకా ఆరోగ్యంగా ఉంటాడు.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: