అమ్మ అను మాటలో ఉంది కమ్మనితనం. ఆ పిలుపు కోసం తపించిపోతారు. అయితే సురక్షితమైన మాతృత్వం గురించి అందరూ కొన్ని విషయాలు  తెలుసుకొని పాటించటం చాలా ముఖ్యం.

ఎందుకంటే గర్భధారణ, ప్రసవం కారణంగా తలెత్తిన సమస్యలతో రోజుకు కనీసం 1400 మంది మహిళలు మరణిస్తున్నారు. ఇంకా వేలాది మంది స్త్రీలు గర్భిణులుగా వున్నప్పుడు తలెత్తే సంక్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు ఎక్కువగా ప్రాణాలకు ముప్పు తెచ్చేవి గానీ, తీవ్రమైన వైకల్యం కలిగించేవి గానీ అయి ఉంటున్నాయి.

 

 

గర్భధారణకు ముందే మహిళ చక్కని పోషకాహారం అలవాట్లు కలిగి, ఆరోగ్యంగా ఉన్నట్లయితే కడుపున శిశువును మోయటం వల్ల తలెత్తే ఆరోగ్య ప్రమాదాలను చాలా వరకు తగ్గించవచ్చు.తెలిసి తెలియని వయసులో పెళ్లి చేయడం, చిన్న వయసులోనే పిల్లల్ని కనటం వల్ల కూడా మహిళలకు చాలా ఇబ్బందులు వస్తాయి. అలాగే  కాన్పులు చేయటం లో నైపుణ్యం గల వైద్యులు, నర్సుల సమక్షంలోనే ప్రసవం జరగాలి. కాన్పు అయిన 12 గంటల లోపు ఆ మహిళను పరీక్షించాలి. శిశు జననం తర్వాత ఆరు నెలలకు మరోసారి ఆమె ఆరోగ్యాన్ని పరీక్షించాలి.

 

 

మహిళలకు కాన్పు ముందు, ఆ తర్వాత అవసరమయ్యే ఆరోగ్య సేవా సదుపాయాలను అందుబాటులో ఉంచటం ప్రభుత్వానిదే బాధ్యత. 18 ఏళ్ల వయస్సు కన్నా ముందు గానీ 35 ఏళ్ల వయస్సు తర్వాత గానీ ధరించే గర్భం మహిళలకు, వారికి కలుగ బోయే పిల్లలకు ఆరోగ్య పరంగా ప్రమాదానికి ఎక్కువ అవకాశాలున్నాయి.తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలంటే, కాన్పుకు కాన్పుకు మధ్య కనీసం రెండేళ్ల గడువు ఉండాలి.వెంట వెంటనే పిల్లల్ని కనకూడదు. ఎందుకంటే ఒకసారి కాన్పు అయ్యాక ఆ మహిళ శారీరకంగా, మానసికంగా బలహీనపడి ఉంటుంది..అప్పట్లో నార్మల్ డెలివరీ అయ్యేది. కాని ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులని బట్టి చాలామంది మహిళలకు  సిసేరియన్ ఆపరేషన్ చేయాలిసిన వస్తుంది.. 

 

 అయితే  నాలుగుసార్లు గర్భం తర్వాత వచ్చే గర్భం వల్ల పిండం ఆరోగ్యానికి, శిశు జననానికి ప్రమాదం పెరిగే అవకాశం ఉంది.భార్య భర్తలిద్దరూ కుటుంబ నియంత్రణ పద్దతులలో తమకు పిల్లలు ఎప్పుడు కావాలి. ఎంత మందిని కనాలి, వారి మధ్య ఎంత ఎడం ఉండాలి అనే ప్రణాళికను అమలు చేయవచ్చు. గర్భ నిరోధానికి నేడు సురక్షితమైన, ఆమోదయోగ్యమైన పద్దతులెన్నో ఉన్నాయి.పురుషులు, స్త్రీలు ఇద్దరి పైనా కుటుంబ నియంత్రణ బాధ్యత ఉంది, తద్వారా ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఉంది.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: