చాలా మంది ముఖం మీద కనపరిచే శ్రద్ధ మెడ మీద చూపించారు మెడ నల్లగా ఉన్నా అపరిశుభ్రంగా ఉన్న పట్టించుకోరు.ముఖం అందంగా ఉంటే చాలు అని అనుకుంటారు.మెడ శుభ్రం విషయంలో నిర్లక్ష్యం గా ఉండడంతో సమస్య తీవ్రమవుతుంది. దీనితో ఇతర మందులు సంప్రదిస్తుంటారు. కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. మెడ మరకలు మురికి చేరి ఉంటుంది కదా ఈ మురికి వదిలించుకోవడానికి చాలాసార్లు సబ్బు పెడుతుంటారు.

 

కొద్దిగా పెరుగు తీసుకుని అందులో బియ్యం పిండి వేసి ఆ మిశ్రమాన్ని మెడకు అప్లై చేయండి అనంతరం గోరువెచ్చని నీటితో కడుక్కోండి.బేకింగ్ సోడా ను నీటిలో మిక్స్ చేసి ఆ పేస్ట్ ను మీ మెడ మీద అప్లై చేయాలి నుండి పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి రోజ్ వాటర్ తో మెడను శుభ్రం చేసుకుంటే మేడ సౌందర్యం అద్భుతంగా మెరుగుపడుతుంది. మెడ మీద నలుపు నివారించుకోవడం కోసం నిమ్మ రసానికి కొద్దిగా పంచదార మిక్స్ చేసి దీన్ని మెడ చుట్టూ అప్లై చేసి పది నిమిషాల తర్వాత శుభ్రం చేసి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా కనీసం వారానికి రెండు సార్లు చేయండి. తేడా గమనించండి 

 

బియ్యం పిండిలో చర్మాన్ని తెల్లగా మార్చే గుణాలున్నాయి. ఇది చర్మ రంగున్న చాలా ఎఫెక్టివ్ గా మార్చుతుంది. అందుకోసం ఒక టీస్పూన్ బియ్యం పిండికి రెండు టీస్పూన్ల డిస్టిల్డ్ వాటర్ కలపి స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను మెడకు అప్లై చేసి 20 నిముషాల తర్వాత మర్ధన చేస్తూ చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.చర్మంను తెల్లగా మార్చడంలో టమోటో గ్రేట్ రెమెడీ. టమోటోను మెత్తగా పేస్ట్ చేసి మెడకు పూర్తిగా అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత మంచిచల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: