ప్రతి స్త్రీ తన రొమ్ముల యొక్క సైజ్ సరైన పరిమాణంలో ఉండాలని కోరుకుంటుంది. ఎందుకంటే, అందమైన శారీరక ఆకారం పొందేందుకు ఇది ఒక ముఖ్యమైన అంశం. తల్లి పాలు ఇవ్వటం అనేది ఎంతో ముఖ్యమైన అంశం. తల్లి పాలను ఇవ్వటం వలన శిశువుకు మాత్రమే కాదు తల్లి యొక్క ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మరి తల్లి పాలు ఇచ్చే సమయంలో రొమ్ముల యొక్క పరిమాణం పెరుగుతుంది. ఎంత ఎక్కువగా తల్లి పాలు ఇస్తారో దానికి తగినట్లు ఎక్కువ పాలు పేరుకొని పరిమాణం కూడా పెద్దగా అవుతుంది.మొదట్లో తల్లి పాలు ఇచ్చే విధానం తెలియనప్పటికీ క్రమంగా అలవాటుపడి సులభంగా శిశువుకు పాలు ఇస్తారు.

 

ఈ పద్దతిలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తల్లి పాలను ఇవ్వటంతో పాటు సరైన బ్రెస్ట్ సైజు ని కూడా మైన్టైన్ చేయవచ్చు. మరి తల్లి పాలు ఇచ్చే సమయంలో రొమ్ముల యొక్క సైజ్ ను బాలన్స్ చేస్తూ పాలు ఎలా ఇవ్వాలి అన్న వివరాలను  చూద్దాం.మొదట తక్కువ పాలు ఉన్న రొమ్ము నుండి పాలు ఇవ్వడం మొదలు పెట్టాలి. తక్కువ పాలు ఉన్న వైపు మొదట ఇవ్వటం వలన శిశువు మొత్తం పాలు తాగటం వలన అటువైపు ఇంకా ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతుంది. ఇది ఒక సహజ ప్రక్రియ. మీ శిశువు మొత్తం పాలను త్రాగిందని మీరు ఏమాత్రం భయపడనక్కర్లేదు. ఎంత త్రాగితే అంత ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతుంది. కనుక మొదట తక్కువ పాలు ఉన్న వైపు నుండి ప్రారంభించండి. క్రమంగా రెండు రొమ్ముల యొక్క పరిమాణం సమానంగా అవుతుంది.ఒకే పక్కన పాలను ఇవ్వటం వలన చన్ను నొప్పి పుడుతుంది. కనుక రెండు రొమ్ముల్లోనూ మారుస్తూ పాలను ఇవ్వాలి.

 

ఒక వైపు పాలు పూర్తవగానే మరో వైపు పాలను మీరు పంప్ చేయకూడదు. మీ శిశువే పాలను త్రాగగలరు. కనుక ఇరువైపులా మారుస్తూ పాలు ఇవ్వండి. ఏదైనా ఒక వైపు తక్కువ పాలు త్రాగినట్లయితే అటువైపు తక్కువ పాలు ఉత్పత్తి అయితే సరిపోతుందని సూచన.శిశువుకు 15-20 నిమిషాల పాటు పాలు ఇవ్వటం అలవాటు చేయాలి. ఇలా చేయటం వలన తల్లికి శారీరక బలహీత కలగకుండా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే చన్ను నొప్పి కూడా కలగదు. అంతే కాదు మొదటి 15 నిమిషాలు అందించే పాలలోనే అధిక శాతం పోషకాలు ఉంటాయి. కనుక ఇది శిశువు యొక్క ఆరోగ్యానికి కూడా మంచిది.తల్లి పాలు ఇచ్చే సమయంలో మాములుగా రొమ్ముల యొక్క పరిమాణం పెరుగుతుంది. కానీ కొందరికి మునుపటి లానే చిన్నగానే ఉంటుంది. మరి వాటి పరిమాణంను పెంచటం ఎలా? ఇందుకు ఒకటే మార్గం ఎక్కువగా తల్లి పాలను ఇవ్వడం. ఏ వైపు రొమ్ము చిన్నగా ఉందని అనిపిస్తుందో అటువైపు రొమ్ము పాలను ముందుగా శిశువుకు అందించండి. ఆ తరువాత మరో రొమ్ము పాలను ఇవ్వండి.

 

ఇలా చేయటం వలన మొదటి వైపు పూర్తి పాలు డ్రైన్ అయిపోతుంది. దీని ఫలితంగా అటువైపు అధిక పాలు ఉత్పత్తి అవుతుంది. అవును, మీరు విన్నది నిజమే, ఎంత ఎక్కువగా శిశువు పాలను త్రాగుతారో అంత వేగంగా మరియు అంత అధికంగా పాల ఉత్పత్తి జరుగుతుంది. ఇది ఒక సహజ ప్రక్రియ. ఇలా సహజంగా బ్రెస్ట్ యొక్క పరిమాణం పెరుగుతుంది.మరి ఈ చిట్కాలను పాటించి మీ శిశువు ఆరోగ్యాన్ని, మీ ఆరోగ్యాన్ని మరియు మీ శారీరక ఆకృతిని కూడా కాపాడుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: