అమ్మ తనం ప్రతీ అమ్మాయికి  ఒక వరంలాంటిది.  గర్భాధారణ సమయంలో  తల్లి పడే కష్టం, పిల్లలకోసం పడే ఆరాటం మాటల్లో చెప్పలేనిది. పిల్లలకోసం  ఎంత నొప్పి నైన బరించే ఓపిక  ,సహనం ఒక్క మాత్రుమూర్తికే ఉంటుంది. అందుకే తల్లి ని భూదేవితో పోల్చటం జరుగుతుంది.అలాంటి తల్లులు గర్భధారణ సమయంలో శరీరంలో చోటు చేసుకునే మార్పులు గూర్చి తెలుసుకుందాం. 

 

 

 

గర్భాధారణ జరిగిన తరువాత మన శరీరం లో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. వాటి గూర్చి ఎటువంటి ఆందోళన చెందవలిసిన పనిలేదు.అయితే గర్భధారణ సమయంలోని 9 నెలల కాలాన్ని మూడుగా విభజించారు. వాటినే మూడు త్రైమాసకాలు అని అంటారు. మొదటి మూడు నెలలని మొదటి త్రైమాసముగా, నాలుగవ నెలనుంచి ఆరవ నెలవరుకు రెండవ త్రైమాసముగా, చివరి మూడు నెలలు మూడవ త్రైమాసముగా విభజించడం జరిగింది. 

 

మొదటి త్రమాసికంలో  మహిళ ఎల్లప్పుడూ అలసటతో పాటు నిద్ర మత్తుగా ఉండటం.అప్పుడప్పుడు అజీర్తి, కడుపు నొప్పి ఉండటం.వక్షోజాలు కాస్త నొప్పిగా, బరువుగా ఉంటాయి.అలాగే విపరీతమైన వాంతులతో  నిరస పడిపోతారు. ఏది తినాలన్న తినబుద్ది కాదు. పలుమార్ల మూత్ర విసర్జన కూడ గమనించవచ్చు.

 

మానసిక కల్లోలం గా ఉండటంతోపాటు కడుపులో పాప పెరుగుతుండటం వలన నొప్పులు రావడం జరుగుతుంది.పొట్ట కింది ప్రాంతంలో చర్మం సాగటం తో పాటు ఎక్కువగా దురద ఉంటుంది.గుండెలో మంట పుట్టడం మరియు వికారం, వేవిళ్లు రావటం ను గమనించవచ్చు.మానసిక స్థితిలో మార్పుతో పాటు చిరాకు, విసుగు పుడుతుంది.అప్పుడపుడు భయంగా మరియు సంతోషంగా ఉండటం ఉంటుంది. రండవ త్రైమాసికంలో  వక్షోజాల నుండి పాలు కారడం, దురదగా ఉంటుంది . హార్మోన్ల విడుదలలో మార్పువలన ఎక్కువగా చెమట పట్టడం జరుగుతుంది. 

 

మూడవ త్రైమాసికంలో కడుపు లో పాప పెరుగుతుండడం వలన తల్లి మూత్రాశయం పై పీడనం పడటం వల్ల ఎక్కువగా మూత్రం రావడం జరుగుతుంది.చేతులు మరియు మడమలు మోకాళ్లు లో కొంత వాపు రావడం గమనించవచ్చు. నడుము నొప్పులు రావడం, మల బద్ధకం ఉండటం, మొలలు రావటం, పాప పెరుగుతుండడం వలన కడుపు కండరాలు, నారాలు సాగటం జరుగుతాయి.అలాగే ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు ఉంటాయి.  పైన చెప్పినవి అన్ని అందరిలో కచ్చితంగా ఉండాలి అని చెప్పటం లేదు. కొందరిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పటం మాత్రమే మా ఉద్దేశ్యం.ఎక్కువగా శారీరక శ్రమ చేయటం మంచిది కాదు. అలాగని పూర్తిగా చేయకుండా కూడ ఉండరాదు. డాక్టర్ సలహా మేరకు వ్యాయామం చేయడం మంచిది.

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: