వైట్ వెనిగర్ తరచూ చర్మ సంరక్షణా ప్రయోజనాలకు ఉపయోగించే బహుముఖ పదార్ధం. ఇది ఇబ్బందికరమైన చర్మ సమస్యలకు అనేక రకాలుగా చికిత్స చేస్తుంది. వైట్ వెనిగర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేసి మొటిమలు, నల్లని మచ్చలు, బ్లాక్ హెడ్స్, పిగ్మేంటేషన్ వంటి ఎన్నో చర్మ సమస్యల పరిష్కరానికి సహాయపడుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రభావవంతమైన వైట్ వెనిగర్ పిగ్మేంటేషన్, సమంగా లేని స్కిన్ టోన్,మొటిమల  మచ్చలు వంటి వివిధ రకాల చర్మ సమస్యలను తొలగించగలవు.

 

అయితే వైట్ వెనిగర్ ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఒక స్పూన్ ఉల్లిపాయ రసంలో ఒక స్పూన్ రోజ్ వాటర్, ఒక స్పూన్ వైట్ వెనిగర్ వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నిముషాలు తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది పిగ్మేంటేషన్ తొలగించటానికి చాలా బాగా సహాయపడుతుంది. మంచి ఫలితం కోసం వారంలో ఒకసారి ఈ విధంగా చేయాలి.

వైట్ వెనిగర్1 టీస్పూన్, 1 టీస్పూన్ బియ్యంపిండి, 2 టీస్పూన్ల రోజ్ వాటర్ కలపి మిశ్రమం తయారుచేయండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం అంతా అప్లై చేసి 10 నిమిషాలు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడగండి. మృదువైన, కాంతివంతమైన చర్మం కోసం ఇంట్లో తయారుచేసిన ఈ మిశ్రమాన్ని వారానికి ఒకసారి ఉపయోగించండి.ఒక టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్ లో కొద్దిగా వాటర్ వేసి కలిపి ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ పై రాసుకుని 10-15 నిమిషాల పాటు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో కడిగేయండి.

సమమైన స్కిన్ టోన్ పొందడానికి ఈ మిశ్రమాన్ని వారానికి ఒకసారి ఉపయోగించండి.రెండు స్ట్రా బెర్రీలను పేస్ట్ గా చేసి దానిలో ఒక స్పూన్ వైట్ వెనిగర్ వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే బ్లాక్ హెడ్స్ సమస్య తొలగిపోతుంది.

 

ఒక బౌల్ తీసుకుని అందులో 1 టీస్పూన్ వైట్ వెనిగర్, 2 టీస్పూన్ల అలోవేరా జెల్ వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని మీ ముఖం, మెడ భాగానికి రాసుకుని 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగండి. యక్నే మచ్చలను పోగొట్టుకోవడానికి ఈ మిశ్రమాన్ని ఒక భాగంగా చేసుకోండి.ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ లో ఒక స్పూన్ వైట్ వెనిగర్ కలిపి ముఖానికి రాసి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మంలో పొడి తగ్గి తేమ పెరుగుతుంది.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: