మన దేశ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రాజకీయాల్లో ఇప్పటి వరకు చూడని విలక్షణ మనస్తత్వం ఉన్న నాయకుడు ఆయన. మోడీ రాజకీయం గురించి గానీ ఆయన పట్టుదల గురించి గాని ఆయన అనుకున్నది సాధించే విధానం గాని చాలా మందికి నచ్చుతూ ఉంటుంది. రాజకీయాల్లో గత వందేళ్ళలో ఆయన లాంటి నేతను చాలా మంది చూడలేదు అనేది వాస్తవం. రాజకీయాల్లో మోడీ చూపిస్తున్న ప్రభావం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రధానిగా అయినా ముఖ్యమంత్రి గా అయినా సరే ఆయన ఒక స్థాయిలో దేశం మీద ప్రభావం చూపించారు. 

 

అయితే మోడీ నేడు రాజకీయాల్లో ఈ విధంగా ఉండి ప్రభావం చూపించడానికి ప్రధాన కారణం ఆయన తల్లి అంటూ ఉంటారు. ఆమె ఆయన వెంట ముందు నుంచి నిలబడ్డారు. తండ్రి మరణించిన నాటి నుంచి నేటి వరకు కూడా ఆయనకు ఆమె నుంచి అందిన ప్రోత్సాహం గురించి చాలా మంది ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. ఆమె మోడిని పెంచిన తీరు గుజరాత్ అల్లర్ల సమయంలో మోడికి అండగా నిలబడిన తీరు అన్నీ కూడా ఒక సంచలనం. ఆమె మోడీ భయపడుతున్న సమయంలో ఆయన రాజకీయ వ్యూహాలకు కూడా ఆమె సహకారం అందించారట. 

 

అదే విధంగా మోడిని కొందరు టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్న సమయంలో కూడా ఆమె నుంచి మోడికి ఊహించని విధంగా మద్దతు లభించింది అని చెప్తూ ఉంటారు. మోడీ ప్రతీ నిమిషం కూడా తల్లికి అత్యంత సన్నిహితంగా ఉండటానికి ఇదే కారణం అని చెప్తారు. ఆయన ఏదోక సందర్భంలో ఆమెను తలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నలుగురు సోదరులు ఉన్నా సరే మోడికి రాజకీయాల మీద ఉన్న శ్రద్దను గమనించి ఆమె ముందుకు నడిపారట.

మరింత సమాచారం తెలుసుకోండి: