టాలీవుడ్ లో అగ్ర హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న హీరో ప్రభాస్. అగ్ర హీరోగా అతను ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వినపడుతున్నాడు. బాహుబలి సినిమా తర్వాత అతనికి వచ్చిన క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ సినిమా తర్వాత అతను వెనక్కు తిరిగి చూసుకునే అవసరం అనేది వచ్చిన సందర్భం లేదు. బాలీవుడ్ దర్శకులు అయినా టాలీవుడ్ దర్శకులు అయినా సరే అతని తో సినిమా చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే నేడు అతని కెరీర్ ఇలా ఉండటానికి ఆయన పెద్దమ్మ కారణం అని అంటారు. 

 

కృష్ణం రాజు సతీమణి ప్రభాస్ కెరీర్ లో చాలా కీలకంగా ఉంటారని అతనికి సంబంధించిన అన్ని విషయాలను ఆమె స్వయంగా పట్టించుకుని అతనికి అండగా నిలబడుతూ ఉంటారని అతని సినిమాలను ముందు నుంచి కూడా ఆమె స్వయంగా ఎంపిక చేస్తూ ఉంటారని ఇప్పటికి కూడా ఆమె పాత్ర అతని సినిమాల మీద ఉంటుంది అని ఆర్ధిక వ్యవహారాలను కూడా అత్యంత జాగ్రత్తగా ఆమె గమనిస్తూ ఉంటారని ప్రభాస్ కి ఆమె అందించిన ప్రోత్సాహం కృష్ణం రాజు నుంచి కూడా వచ్చేది కాదట. 

 

ప్రతీ ఒక్కటి కూడా అతని కెరీర్ లో ఆమె దగ్గర ఉండి చూసుకుకోవడమే అని, ప్రభాస్ కి తల్లి తండ్రుల నుంచి వచ్చిన ప్రోత్సాహం కంటే ప్రధానంగా పెద్దమ్మ నుంచి వచ్చిన ప్రోత్సాహమే చాలా కీలకం అని చెప్తారు. ఆమెకు చెప్పకుండా ప్రభాస్ వ్యక్తిగత జీవితంలో ఏ పని కూడా చేయరు అని చెప్తారు. ఇప్పుడు ప్రభాస్ ఇలా ఉన్నాడు అంటే దానికి కారణం ఆమె అందిస్తున్న ప్రోత్సాహమే అని అంటూ ఉంటారు. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: