మహిళల్లో ప్రతి నెలా బాధించే సమస్య పీరియడ్స్. ఈ సమస్యని  ప్రతి మహిళ అనుభవిస్తుంది.  అయితే ఆ సమయంలో చాలామందికి కడుపునొప్పి, చికాకు, అధిక రక్తస్రావం లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వీటిని కూడా చాలా సహజమైన విషయాలుగానే మనం పరిగణిస్తాం.కానీ ఇలా బహిష్టు సమయంలో మనకు శారీరకంగా ఎదురయ్యే సమస్యలు మన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణలు .

 

మరి ఏ లక్షణాలు ఏఏ ఆరోగ్య సమస్యలను సూచిస్తున్నాయో ఓసారి తెలుసుకుందామా...నెలసరిసమయంలో పొత్తికడుపులో నొప్పి రావడం చాలా సహజమైన విషయంగానే మనం పరిగణిస్తూ ఉంటాం. అయితే కొద్దిమందికి మాత్రమే ఈ నొప్పి మరీ ఎక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు చాలా మంది పెయిన్ కిల్లర్స్ ఉపయోగిస్తుంటారు.అది మంచిది కాదు. సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా నొప్పి వస్తున్నట్లైతే అది ఎండో మెట్రియోసిస్ అయ్యే అవకాశాలున్నాయి.కాబట్టి బహిష్టు సమయంలో నొప్పి ఎక్కువగా వస్తున్నట్లైతే వెంటనే సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

 

పీరియడ్స్పీమయంలో సాధారణ స్థాయిలో అయ్యే రక్తస్రావం కన్నా ఎక్కువగా అవుతుంటే అది రక్తహీనతకు సూచనగా భావించాలి. అలాగే కొన్ని సందర్భాల్లో అది ఫైబ్రాయిడ్స్ లేదా ఎండోమెట్రియోసిస్ సమస్య కూడా కావచ్చు. వీటి వల్ల గర్భధారణ సమయంలో లోపాలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే రక్తస్రావం మరీ తక్కువగా ఉంటే అది ఎనీమియాతో పాటు హార్మోన్ల అసమతౌల్యానికి సూచన.

 

కాబట్టి నిపుణులను సంప్రదించి వారి సూచనల మేరకు నడచుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.బహిష్టు సమయంలో శరీరం నుండి బయటకు వచ్చే రక్తం రంగు కూడా మన హార్మోన్ల పనితీరు తెలియజేస్తుంది. రక్తం రంగు ఎర్రగా ఉన్నట్లైతే శరీరంలో విడుదలయ్యే హార్మోన్లు సమతౌల్యంగా ఉన్నాయని అర్ధం. అదే ఈ రంగు లేతగా ఉన్నా లేదా ముదురు రంగులో ఉన్నా ఈస్ట్రోజెన్ స్థాయిలో హెచ్చుతగ్గులున్నట్లే.కొంత మందికి నెలసరి పూర్తయిన కొన్ని రోజుల తర్వాత బ్లీడింగ్ అవుతుంది. గర్భ నిరోధక మాత్రలు వాడుతున్న వారిలో అయితే దీన్ని సాధారణమైన అంశంగానే భావించవచ్చు. అయితే మాత్రలు వాడని వారిలోనూ ఇలాగే జరుగుతున్నట్లైతే అది వెజైనల్ ఇన్ఫెక్షన్లకు సూచనగా భావించవచ్చు.

 

కొంతమందిలో అది క్యాన్సర్ కి సంబంధించిన సూచన కూడా కావచ్చు. కాబట్టి పీరియడ్స్ కి, పిరియడ్స్ కి మధ్యలో రక్తస్రావం అవుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.సాధారణంగా పిరియడ్స్ వచ్చిన మొదటి రోజు నుంచి 5 రోజులదాకా రక్తస్రావం అవుతుంది. మొదటి రెండు నుంచి మూడు రోజులు కాస్త ఎక్కువగా మిగిలిన రోజులు తక్కువగా రక్తస్రావం అవుతుంది. ఈ రెండు అంశాల్లోనూ ఎలాంటి తేడా లేకపోయినా..ఏ సమస్యా లేనట్లుగానే భావించాలి.ప్రస్తుత కాలంలో చాలా మంది స్త్రీలలో ఈ సమస్య ఉంది. అండాశయంలో పాలీసెస్టిక్ ఓవేరీ ఉండటం వల్ల రుతుక్రమంలో హెచ్చుతగ్గులు ఏర్పడుతాయి. ఒక్కోక్కోసారి పిల్లలు  పుట్టకపోవడానికి  కూడా కారణం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: