ఈ ఆధునిక కాలంలో అసలు  హ్యాండ్ బ్యాగ్ లేకుండా బయటకు వెళ్లే మహిళ ఉండదు. ఆడవాళ్ళ ఫ్యాషన్ కు ఐకాన్ హ్యాండ్ బ్యాగ్.ఏ డ్రెస్ కి ఏ హ్యాండ్ బ్యాగ్ బాగుంటుందో అంటూ రకరకాల అంశాలను పరిశీలించి మరీ కొంటారు. కానీ ఆ బ్యాగ్ లో ఏమి ఉండాలి అన్న విషయాన్ని మాత్రం ఆలోచించారు.  ఎదో బాగా తగిలించుకున్నామా అన్నట్టు ఉంటారు.ఇది సరికాదు ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎటునుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఈరోజుల్లో ఎవరికి తెలియదు.  కాబట్టి ప్రతి మహిళ తనను తాను కాపాడుకోవటానికి తన బ్యాగ్ లో కొన్ని వస్తువులను తప్పని సరిగా ఉంచుకోవాలి.

 

అలాగే మతి మాటికీ అవసరమయిన ప్రతిదానికి ఇంటికి పరిగెత్తకుండా అన్ని హ్యాండ్ బ్యాగ్ లో ఉంచుకుంటే మంచిది. హ్యాండ్ బ్యాగ్ లో ఖచ్చితంగా ఒక షార్ట్ నోట్ బుక్, పెన్  ఉంచుకోవాలి ఇందులో పోలీస్ స్టేషన్, ఉమెన్స్ సొసైటీ, హాస్పిటల్, ఇంట్లో వాళ్ళ నెంబర్లు, ఆఫీస్ ఫోన్ నెంబర్లు, ఉంచుకోవడం మంచిది.  ఒక పెన్ను ఒక పుస్తకం బ్యాగ్ లో ఉండటం మంచిది ఎందుకంటే ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు, ఫోన్ చేయలేని పరిస్థితుల్లో, కేకలు వేయలేని పరిస్థితుల్లో ఈ రెండు ఉపయోగపడతాయి. ఆడవాళ్లు హ్యాండ్ బాగ్ లో పెప్పర్ స్ప్రే ఉంచుకుంటే మంచిది. లేకపోతే కనీసం కారపుపొడి కాసింత మూటగట్టి పెట్టుకోండి కేవలం రక్షణకు. రోజులు మారుతున్నాయి ఎప్పుడు ఎం జరుగుతుందో చెప్పలేం మనం మన జాగ్రత్తలో ఉంటె చాల మంచిది.

 

అలాగే  హ్యాండ్ బాగ్ లో లిప్స్టిక్స్, పేస్ వాష్ క్రీమ్...ఇంకా మిగతా వస్తువలతోపాటు సంరక్షణకు అవసరమయ్యే వాటిని కూడా పెట్టుకోవాలి.కొంచెం డబ్బు కూడా పెట్టుకుంటే మంచిది.  అలాగే ఐడి కార్డ్స్, ఎటిఎం కార్డ్స్ అన్ని పెట్టుకోవాలి.. ఒక బిస్కేట్ ప్యాకెట్ అండ్ ఒక వాటర్ బాటిల్ కూడా పెట్టుకుంటే మంచిది. 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: