తల్లయ్యే వరం దేవుడు ఆడవాళ్ళకి మాత్రమే ఇచ్చాడు.. తల్లి అవడం ద్వారానే మగువ జీవితానికి ఒక అర్థం వస్తుంది. నవమాసాలు మోసి ఒక ప్రాణాన్ని ఈ భూమి మీదకి తెచ్చే సామర్థ్యం మగువలకే కలదు. ప్రెగ్నన్సీలో అనేక నొప్పులు, సమస్యలు అలాగే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమస్యలన్నీ పాపాయి కల్మషం లేని చిరునవ్వును చూడటంతో తగ్గిపోతాయి. అయితే, ప్రెగ్నన్సీ ద్వారా మగువలలో కలిగే మార్పులను ఏ మాత్రం అశ్రద్ధ వహించవద్దు. ప్రెగ్నన్సీ ద్వారా మహిళల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి.

 

 

అయితే, కొన్నిటిని ఇగ్నోర్ చేయడం వలన తల్లిబిడ్డల ప్రాణానికి ప్రమాదం ఏర్పడవచ్చు.గర్భవతి సమయంలో మహిళలు అనేక  శారీరక,  మానసిక మార్పులకు గురవుతారు. ఇది మీకు రెండవ లేదా మూడవ ప్రెగ్నన్సీ అయితే ప్రెగ్నన్సీలో జరిగే మార్పులు మీకు తెలిసే ఉంటాయి. కొత్తగా తల్లవుతున్న వారికి మాత్రం ప్రెగ్నన్సీ అనేది కాస్త తికమక కలిగిస్తుంది.  ఇక్కడ ప్రెగ్నన్సీ వలన మహిళల్లో ఏర్పడే మార్పుల గురించి వివరించాము. నెలలు పెరుగుతున్న కొద్దీ మీ కడుపు పెద్దదవుతూ వస్తుంది. ప్రెగ్నన్సీ అనగానే అందరికీ గుర్తుకువచ్చే మొట్టమొదటి మార్పు ఇదే.

 

 


ప్రెగ్నన్సీ వలన మహిళల ఇంటర్నల్ ఆర్గాన్స్ పోసిషన్ లో అలాగే వాటి పనితీరులో మార్పులు ఏర్పడతాయి. ఇంకొక ప్రాణాన్ని గర్భంలో మోస్తున్నందుకు లంగ్స్ కాస్తంత కుచించుకుపోతాయి. బ్రెస్ట్ లో వాపు ఏర్పడుతుంది. రిబ్ కేజ్ అనేది సాధారణం కంటే పెద్దగా మారుతుంది.జీవితంలో ఎప్పుడైనా బరువును నియంత్రణలో ఉంచుకునే అవకాశం ఉంటుంది. అయితే, ప్రెగ్నన్సీలో మాత్రం అదనపు బరువును అదుపులో చేయలేరు. గర్భస్థ శిశువు అలాగే ఆమ్నాయిటిక్ ఫ్లూయిడ్ లు ఈ బరువుకు కారణం!ప్రెగ్నన్సీ వలన మహిళల పొట్ట పై ఇరిటేటింగ్ స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. గర్భం దాల్చినప్పుడు చర్మం అనేది సాగుతుంది. అందువలన, ప్రసవం తరువాత అటువంటి స్ట్రెచ్ మార్క్స్ అనేవి కనబడతాయి.ప్రెగ్నన్సీ తరువాత హెయిర్ ఫాల్ సమస్య వేధిస్తుంది. కొంతమంది ప్రెగ్నన్సీ తరువాత తమ హెయిర్ టెక్స్చర్ అనేది మార్పులకు గురయిందని అంటుంటారు. ఆయిలీ గా లేదా డ్రై గా తమ హెయిర్ మారిపోయిందని అంటుంటారు. అలాగే, కొంతమంది తమజుట్టు  కలర్ లో మార్పును కూడా గమనించి ఉండుంటారు.

 

 

శరీరంలో తలెత్తే మార్పులు ఒకవైపైతే, మానసిక మార్పులు మరోవైపు. మార్నింగ్ సిక్నెస్ మరియు వాంతులు  వలన కఅనేక  సమస్యలు అలాగే మతిమరుపు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.ఇది అత్యంత సాధారణ సమస్య. మీరెంత కష్టపడినా కొన్ని సార్లు ప్రెగ్నన్సీలో స్ట్రెస్ ను అధిగమించలేము. ప్రెగ్నన్సీలోని స్ట్రెస్ వలన శారీరక అలాగే మానసిక సమస్యలు తలెత్తుతాయి. డిప్రెషన్ భావనలు పెరుగుతాయి. ఈ లక్షణాలను మీరు గమనిస్తే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించండి. వారి సూచనలను పాటించండి.మీ శరీరంలో ప్రెగ్నన్సీ వలన అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. మీ మూడ్ పై కూడా ప్రెగ్నన్సీ ప్రభావం ఉంది. అనవసర విషయాలకి ఇరిటేట్ అయిపోతూ ఉంటారు.ఇవన్నీ, ప్రెగ్నన్సీ వలన శరీరంలో తలెత్తిన హార్మోన్ల మార్పుల ప్రభావమని వైద్యులంటున్నారు.

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: