మనం లావుగా ఉన్న సన్నగా ఉన్న ముఖం చాలా చక్కగా అందంగా ఉండాలి అని చాలామంది అమ్మాయిలు కోరుకుంటారు.అయితే ప్రతి ఒక్కరి ముఖానికి కళ్ళు అందం.ఇంకొక విషయం ఏంటంటే మన  కంటి చుట్టూ ఉన్న చర్మం బట్టి మన వయసు తెలుస్తుందని నిపుణులు చెబుతున్నారు అందుకే వయసు చిన్నగా కనపడి మంచి మెరుపు లాంటి కళ్ళు మీ సొంతం అవ్వాలంటే ఏమి చెయ్యాలో చూద్దాము.

 


అందమైన కళ్ల కోసం నువ్వుల నూనె చాలా బాగా  పనిచేస్తుంది.కళ్లు అందంగా మెరిసిపోవాలంటే.. ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు నువ్వుల నూనెను కళ్ల కింది ముడతలపై మర్ధన చేసి నిద్రించాలి. ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తుంటే కళ్ల కింది ముడతలు పోయి చర్మం మృదువుగా అందంగా తయారవుతుంది.

 

 

అలాగే ఆముదం, కొబ్బరి నూనెలు కూడా కంటి కింద ముడతలకు చెక్ పెడతాయి. కొబ్బరినూనెను నిద్రించే ముందు కళ్ల కింద రాయాలి. ఉదయాన్నే లేచి గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. దీని వల్ల కళ్ల కింద ముడతలు త్వరగా తగ్గిపోతాయి. చర్మంపై కొబ్బరి నూనెతో మర్ధన చేసుకుంటే చర్మం
మృదువుగా తయారవటంతో పాటు మచ్చలు తొలగిపోతాయి.కాటన్ పాడ్స్(పత్తి ఉండలు) తీసుకొని రోజ్ వాటర్ లో కొన్ని నిముషాలు డిప్ చేసి, ఈ కాటన్ బాల్స్ ను మీ మూసిన కళ్ళ(కనురెప్పల) మీద పెట్టుకోవాలి. పది నిముషాల తర్వాత కాటన్ ఉండలు తీసేసి, చల్లటి నీటితో కళ్ళు తుడుచుకోవడం వల్ల కళ్ళ చుట్టూ ఉన్న నల్లటి చర్మం మారి ప్రకాశవంతంగా కనిపిస్తుంది

 

 

ఇక ఆముదం నూనె కూడా ముడతలు, మచ్చలపై మెరుగ్గా పనిచేస్తుంది. కళ్ల కింద ఉండే ముడతలు, మచ్చలు పోవాలంటే వాటిపై రాత్రి నిద్రపోయే ముందు ఆముదంతో మర్ధన చేయాలి.కనీసం వారానికి రెండు సార్లు అయినా కీరదోస ముక్కలని చక్రాల్లాగా కోసి కళ్ళ మీద పెట్టుకుని కనీసం ఒక పావుగంట సేపు అయినా ఉంచుకుంటే కళ్ళకి చాలా మంచిది.అలాగే కంటి కింద నల్లటి వలయాలు కూడా తగ్గుముఖం పడతాయి.. ఎక్కువా ఆలోచన అనేది ఉండకూడదు.కంటి నిండా నిద్ర పోవాలి.ఒక్కోసారి నిద్ర చాలకపోయినా మచ్చలు పడే అవకాశం ఉంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: