ఆడవాళ్లు ముఖ్యంగా ఇబ్బంది పడే సమస్య అవాంఛిత రోమాలు.. కొంతమందికి గడ్డం మీద మీసాల మీద, చెంపలపై అవాంఛిత రోమాలు ఏర్పడతాయి. ఇవి ఆడవాళ్ళని భలే ఇబ్బంది పెడతాయి. అవాంఛిత రోమాలకు ముఖ్య కారణం వివిధ రకాల మందులు చర్యల ఫలితంగా శరీరంలో హార్మోన్ల అసమతుల్యతల వల్ల  అవాంఛిత రోమాలు ఏర్పడతాయి. ఇలా రోమాల పెరుగుదల కారకాలను నియంత్రించటం లేదా నిర్వహించటం చాలా కష్టమనే చెప్పవచ్చు. కానీ కొన్ని రకాల ఇంట్లో ఉండే ఔషదాల ద్వారా ముఖ చర్మంపై ఉండే అవాంఛిత రోమాలను పూర్తిగా తొలగించుకోవచ్చు. అవాంఛిత రోమాలను సమర్థవంతంగా తగ్గించే ఇంట్లో ఉండే ఔషదాలు మరియు వాటి గురించిన వివరాలు కింద తెలుపబడ్డాయి.

 

ముడి శనగ పిండి లేదా శనగ పిండికి నీరు లేదా పాలను కలిపి మందమైన పేస్ట్ లా తయారు చేయండి. ఈ మిశ్రమానికి ¼ పసుపు పొడి మరియు తాజా క్రీమ్  కలిపి పేస్ట్ లా తయారు చేయండి. అవాంఛిత రోమాలు గల ప్రదేశంలో నేరుగా ఈ పేస్ట్ ను అప్లై చేయండి. 20 నుండి 25 నిమిషాలలో ఎండిపోయి, పొడిగా మారుతుంది. ఈ పేస్ట్ ను చేతివేళ్ళ సహాయంతో, ప్రభావిత ప్రాంతాలలో రాయండి.ఈ రకమైన ఫేషియల్ పేస్ట్ వాడకం వలన చర్మం దురదలకు గురవవచ్చు కానీ, ఈ దురదలు కూడా ఎక్కువ సమయం పాటు ఉండవు. ఈ పేస్ట్ ను క్రమంగా వాడటం వలన బుగ్గలు మరియు గడ్డం ప్రాంతంలో అవాంఛిత రోమాలు తగ్గు ముఖం పట్టడం గమనించవచ్చు.
చక్కెర, నిమ్మరసం మరియు నీటిని కలిపి చిక్కని పేస్ట్ లా తయారు చేయండి.

 

ఈ మిశ్రమాన్ని చేతి వేళ్ళ సహాయంతో వెంట్రుకల పెరుగుదలకు వ్యతిరేఖంగా అప్లై చేయండి. 15 నుండి 20 నిమిషాల పాటు అలానే ఉంచటం వలన ఇది పొడిగా మారుతుంది. తరువాత చల్లటి నీటితో తొలగించండి. నిమ్మ మరియు చక్కెరలు కలిపిన మిశ్రమం నుదుట మరియు బుగ్గలపై ఉండే అవాంఛిత రోమాలను తొలగిస్తుంది. ఈ రకానికి చెందిన ఫేస్ మాస్క్ ను వారంలో రెండు సార్లు ముఖానికి అప్లై చేయవచ్చు.

 

శనగపిండి, నిమ్మరసం మరియు నీరు కలిపిన మిశ్రమం అవాంఛిత చర్మాలను తొలగించుటలో శక్తివంతంగా తగ్గిస్తుంది. ఈ రకమైన మాస్క్ తయారీలో 10 మిల్లిలీటర్ల నిమ్మరసం, 30 గ్రాముల శనగ పిండిని ఒక కప్పు నీటిలో కలిపండి. పసుపు రంగులో ఉండే ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల వరకు ఉంచి, తొలగించండి..ఇలా కనీసం వారానికి మూడు సార్లు అయిన చేస్తే వెంట్రుకలు తొలగిపోతాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: