మన శరీరంలో ఎక్కువగా పట్టించుకోని  భాగాలలో మెడ ఒకటి. సబ్బుతో రుద్ది కడిగినా, స్క్రబ్ చేసి మృతకణాలు తొలగించినా, ప్యాక్ వేసి చర్మం బిగుతుగా చేసినా...అన్నీ ముఖానికి మాత్రమే పరిమితం చేస్తాం.అందువల్ల మెడ నల్లగా మారుతుంది.. ముఖం అంతా తెల్లగా ఉండి మెడ ఒక్కటి నల్లగా ఉంటే ఆడవాళ్ళకి భలే ఇబ్బందిగా ఉంటుంది.. అందుకే కొన్ని చిట్కాలు పాటించడం వలన మీ మెడ తెల్లగా, మృదువుగా చేసుకోవచ్చు. ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.ఎండల్లో తిరిగినప్పుడు ఇంటికి రాగానే వేడినీటితో మెడను శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మెత్తని టవల్‌తో తుడుచుకోవాలి. గిల్ట్ నగలు ధరించటంవల్ల నల్లటి మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటివల్ల దురదలు కూడా వస్తాయి. కాబట్టి వేసవికాలంలో గిల్టు నగలను ధరించకపోవటం ఉత్తమం.

 

 

నిమ్మకాయ రసంలో కొద్దిగా ఉప్పు కలిపి మెడమీద రుద్దుకుని 5 లేదా 10 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. నిమ్మకాయలలోని విటమిన్ సి మెడమీద ఉన్న మృతకణాలను నాశనం చేస్తుంది. అలాగే సూర్యరశ్మి వలన వచ్చే నలుపును కూడా తొలగిస్తుంది. ఒక స్పూన్ నిమ్మరసంలో స్పూన్ దోసకాయరసం కొద్దిగా గంధం కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మెడమీద రాసుకుని అరగంట తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. రోజు ఈ విధంగా చేయడం వలన మీ మెడమీద నలుపు త్వరగా తగ్గిపోతుంది.మెడ తెల్లగా కావాలంటే ఒక స్పూన్ గంధంలో కొద్దిగా రోజ్‌వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని రాత్రివేళ మెడకు రాసుకుని ఉదయాన్నే కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన మెడతెల్లగా మారుతుంది. నిమ్మరసంలో కొద్దిగా పసుపు కలిపి పెట్టుకున్నాకూడా మెడతెల్లగా కనిపిస్తుంది. ఆలుగడ్డను ముక్కలుగా కోసుకుని రెండు వారాలకోసారి మెడమీద రుద్దుకుంటే మీరే ఆ తేడాని గమనించవచ్చును.

 

బాదంపప్పులను 5 నుంచి 6 తీసుకుని నాలుగుగంటలు నీళ్ళలో నానబెట్టాలి, ఆ తరువాత వాటికి పొట్టుతీసి కొద్దిగా రోజ్‌వాటర్ కలిపి పడుకునే ముందు మెడమీద రుద్దుకుని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడుక్కుంటే మెడ మీద గల నలుపు తొలగిపోతుంది. కలబంద రసాన్ని మెడమీద రుద్దుకుని 20 నిమిషాల తరువాత కడిగేసుకుంటే మెడతెల్లగా కనిపిస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: