సాధారణంగా స్త్రీలు అందంగా ఉండటం కోసం రకరకాల క్రీములను వాడుతుంటారు. బ్యూటీపార్లర్లకు వెళ్తూ ఉంటారు. కాని పైసా ఖర్చు లేకుండా సహజసిద్దంగా మనకు ప్రకృతిలో లభించే ఆహార పదార్ధాలు, పండ్లు, కూరగాయలతో మన అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం.
ప్రతిరోజు తప్పనిసరిగా ఎక్కువుగా మంచినీటిని త్రాగాలి. ఇలా త్రాగడం వలన చర్మం పొడిబారిపోకుండా ఎంతో తేజోవంతంగా, అందంగా కనిపిస్తుంది. ముఖంపై మెుటిమలు, మచ్చలు తొలగిపోయి చర్మం ఎంతో కాంతివంతంగా, మెరుస్తూ ఉంటుంది.

 


 క్యారెట్‌లో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. కనుక ప్రతిరోజు క్యారెట్ జ్యూస్ తాగడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. అసిడిటిని తగ్గిస్తుంది. బీట్‌రూట్ జ్యూస్‌ను క్రమంతప్పకుండా తాగడం వలన రక్తంలోని ఎర్రరక్తకణాల సంఖ్య పెరుగుతుంది. ఈ జ్యూస్ రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. కిడ్నీలను శుద్ది చేస్తుంది. దీనిని తరచూ తాగడం వలన చర్మ సౌందర్యాన్ని మరింతగా పెంచుకోవచ్చు. టమోటాలను జ్యూస్ చేసి ప్రతిరోజు త్రాగడం వలన కూడా ఎంతో ఆకర్షణీయమైన చర్మాన్ని పొందవచ్చు. యాపిల్ జ్యూస్ కూడా శరీరానికి మంచిపోషణను ఇచ్చి చర్మానికి మంచి గ్లో రావటానికి సహాయపడుతుంది.చర్మాన్ని మరమత్తు చేయడం మాత్రమే కాదు, కొత్తగా చర్మ కణాలు ఏర్పడుటకు కూడా సహాయపడుతుంది .

 

దానిమ్మ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు. ఇది అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది. ఇంకా చర్మానికి అవసరం అయ్యే తేమను అందిస్తుంది. ఏజింగ్ లక్షణాలను మాయం చేస్తుంది.గ్రేప్ జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ప్రతి రోజూ గ్రేప్ జ్యూస్ ను తాగడం వల్ల మీ చర్మం ఫ్రెష్ గా మరియు మెరుస్తుండేలా చేస్తుంది. అంతే కాదు చర్మంలో గులాబి మెరుపులు తీసుకొస్తుంది . చర్మంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
చర్మం పొడిబారకుండా ఉండటానికి సన్ స్ర్కీన్ లోషన్ అన్ని కాలాలలోను తప్పనిసరిగా వాడాలి. దీనివలన చర్మం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మంచిమెరుపును సంతరించుకుంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: