ఆడవాళ్లు అందానికి ఇచ్చే ప్రాధాన్యత మరి దేనికి ఇవ్వరు. కానీ ఒక్క విషయంలో మాత్రం సరయిన కేర్ తీసుకోరు. ముఖానికి ఇచ్చిన ప్రాధాన్యత మోచేతులు, మోకాళ్ళకి ఇవ్వరు. ఫలితంగా మోచేతులు నల్లగా తయారవుతాయి. దీని వల్ల చాలా ఇబ్బంది పడతారు.ఐతే చాలామంది నల్లబడ్డ మోచేతులను దాచుకోడానికి ఫుల్‌హ్యాండ్స్ డ్రెస్సులు ధరిస్తుంటారు. దీనికో సొల్యూషన్ కూడా ఉంది. నల్లబడ్డ మోచేతి భాగాలను ఇంట్లోనే స్వయంగా తిరిగి సాధారణ చర్మంలా మారేలా చేయొచ్చు.

 

 


శరీరంలోని వేడిని తగ్గించి, శరీరాన్ని చల్లబరిచే గుణం కలబందలో ఉన్నది. కొద్దిగా అలోవేరా జెల్ తీసుకొని నల్లబడ్డ చర్మం మీద రాసి 20 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి. ఆ తర్వాత నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా రెగ్యులర్‌గా కొన్నిరోజులు చేస్తే నల్లబడ్డ చేతులు తిరిగి మామూలు స్థితికి వచ్చేస్తాయి. ఒక వంతు నీరు, మూడు వంతుల బేకింగ్ సోడాతో కలిపి మెత్తటి పేస్ట్ తయారు చేయాలి. రోజుకు రెండుసార్లు నల్లబడ్డ చర్మభాగం మీద రాస్తే కొద్ది రోజుల తర్వాత ఫలితం కనిపిస్తుంది. నల్లబడ్డ చర్మాన్ని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడానికి కొద్దిగా నిమ్మరసాన్ని ఆ ప్రదేశంలో రాయాలి. కనీసం 10 నుంచి 15 రోజులు ఇలా చేస్తే నల్లబడ్డ చర్మం మాత్రమే కాదు.. మిగతా చర్మం కూడా తాజా నిగారింపును సంతరించుకుంటుంది.

 

 


చక్కెర, ఆలీవ్ ఆయిల్ సమభాగాలుగా రెండింటిని మెత్తగా అయ్యేంత వరకు బాగా కలుపాలి. ఆ పేస్ట్‌ను నల్లబడ్డ శరీర భాగాలకు రాసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. రోజుకోసారి బాదం నూనె చర్మానికి రాస్తే తగిన ఫలితం ఉంటుంది. చర్మానికి మెరుపునిచ్చే గుణాలు బాదం నూనెలో పుష్కలంగా ఉంటాయి. నిమ్మరసం చర్మానికి తెల్లదనాన్నిస్తుంది. రెండు మూడు రోజులకోసారి నిమ్మచెక్కలతో మోచేతులకు మర్దన చేస్తే నలుపు క్రమంగా తగ్గిపోతుంది. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అరటిపండు తొక్కతో మోచేతులు రుద్దుకుంటే కూడా ఆ నలుపు పోతుంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: