సాధార‌ణంగా గర్భం దాల్చడం అనేది మహిళకు ఎంత గొప్ప వరమో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. `అమ్మ` అన్న అనుభూతిని పొందాలని కలలు కనని మహిళలు ఉండరు. అంతటి ప్రాధాన్యత ఉన్న అమ్మ.. తన బిడ్డ పుట్టడానికి ముందే ఎన్నో రకాల ఊహలలో విహరిస్తుంది. అమ్మ అనే కమ్మని మాట అనిపించుకోవాలంటే  తొమ్మిది నెలలు శిశువును కడుపులో దాచుకోవాలి. ఇక ఆ టైమ్‌లో ఎన్ని బాధ‌లు, నొప్పులు ఎదురైనా.. తాను మ‌రో ప్రాణానికి జీవం పోస్తున్నాను అన్న ఆనందం ముందు ఏమీ క‌నిపించ‌వు. 

 

ఇక తొమ్మిది నెల‌ల త‌ర్వాత వ‌చ్చేది కాన్పు. ఒక రక౦గా చెప్పాలంటే కాన్పు అనేది ప్రతి మహిళకి పునర్జన్మ లాంటిది. అయిన‌ప్ప‌టికీ తన జీవితంలోకి మరో ప్రాణాన్ని ఆహ్వానిస్తుంది మ‌హిళ‌. ఇక తన ప్రాణంలోనే ఊపిరిపోసుకుంటున్న మరో చిన్ని ప్రాణం గురించి కలలు కంటూ ఎప్పుడెప్పుడూ వారిని చూడాలా అని ఆరాట పడుతుంది. ఇలాంటి సమయంలో ప్రతి మహిళ కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు. ఇదిలా ఉంటే.. సాధార‌ణంగా కొంతమంది సన్నిహితులు, స్నేహితులు.. గర్భంతో ఉన్నప్పుడు మీ కడుపును తాకొచ్చా అని చేతులు వేస్తుంటారు. 

 

ఒకటి, రెండు సార్లు ఇది మంచిదే కానీ, తరుచుగా చేయడం మంచిది కాదు. ఇది మూఢనమ్మకం అని కొట్టిపారేసే వీలు లేదు. ఎందుకంటే.. ఇలా చేయడం సైన్స్ పరంగాను మంచిది కాదు. దీని వల్ల బిడ్డకు వారి స్పర్శ తెలుస్తుంది. ఈ క్ర‌మంలోనే లోప‌ల బిడ్డ కాస్త అసౌక‌ర్యంగా ఫీల్ అవుతార‌ట‌. అంతేకాదు, గర్భంతో ఉన్నప్పుడు తల్లి స్పర్శే పుట్టబోయే పిల్లలకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కచ్చితంగా జాగ్ర‌త్త వ‌హించాలి. ఇక ఆహారం తీసుకోవడం, సరైన వేళలో నిద్ర, వైద్యుల సూచనల మేరకు వ్యాయామం ఇలాంటివన్నీ ప్రెగ్నెంట్స్, పుట్టబోయే పిల్లలకు మంచి చేస్తాయి. అందుకే ఇవి త‌ప్ప‌కుండా పాటించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: