అమ్మ అని పిలిపించుకోవడానికి ప్రతి మహిళ తాపత్రయం చెందుతుంది. కడుపులో బిడ్డ పెరుగుతుందని తెలిసిన దగ్గర నుండి అమ్మ ధ్యాస అంతా బిడ్డ మీదనే ఉంటుంది.. నా  బిడ్డ ఎలా  ఉందో, ఎలా  పెరుగుతుందో అని కంగారుపడుతుంది. అసలు బిడ్డ తల్లి కడుపులో ఎలా పెరుగుతుందో చూద్దాం... స్త్రీ యొక్క అండం వీర్యకణముతో కలయిక పొందే సమయానికి అండము సైజు అంగుళములో ఇరవై యవవంతుమాత్రమే వుంటుంది. కాని ఒక అండము పిండముగా మారిన 14 రోజులకే దీనికి పదిరెట్లు సైజు పెరిగిపోతుంది. నెలా పది రోజులకి అండము పొడవు  దాదాపు ఒక అంగుళము వుంటుంది. పైగా ఈ సమయానికి అండానికి కాస్త శిశుపోలికలు ప్రారంభము అవుతాయి. పిండానికి అక్కడక్కడ కొన్ని నల్లటి మచ్చలు కనబడతాయి. ఈ నల్లటి మచ్చలే తరువాత కళ్ళు, ముక్కు, నోరుగా మారుతాయి. 

 

 

దాదాపు ఇదే సమయానికి వెన్నుపూసకి సంబంధించిన సూచనలు కనబడతాయి. నెలా పది హేను రోజుల పిండానికి కాళ్ళు, చేతులు ఇతర అంగాలు ఒక మాదిరిగా ఏర్పడతాయి ఇదే సమయములో బిడ్డ లింగానికి సంబంధించిన తేడాలు కూడా ఏర్పడే సూచనలు వుంటాయి. నెలా పదిహేను రోజులు దాటిన తరువాత పూర్తిగా సెక్సు భేదాలు ఏర్పడిపోతాయి. పిండానికి రెండు నెలలు నిండేసరికి శరీరంలోని అన్ని అంగాలు తయారవుతాయి. కళ్ళరెప్పలు, చిన్న ముక్కు, చేతివ్రేళ్ళు, కాలివ్రేళ్ళు, గుర్తించే స్థితిలో వుంటాయి. మూడవనెల నిండే సరికి పిండము మూడు అంగుళాల పొడవు వుంటుంది.

 

 

నాలుగవ నెల నిండేసరికి గర్భములోని శిశువు కాళ్ళతో తన్నుతున్నట్లుగా తల్లి గుర్తించడం జరుగుతుంది. అయిదవనెల నిండేసరికి గర్భములోని శిశువు బరువు 6 నుంచి 8 ఔన్సులు వుంటుంది. పొడవు 7 నుంచి 8 అంగుళాలు వుంటుంది. చేతిగోళ్ళు పెరగడము ప్రారంభిస్తుంది. ఇక్కడ నుంచి గర్భము శిశువు చాలా వేగముగా పెరగడం ప్రారంభిస్తుంది. ఈ శిశువు ఏడవనెలలో 3 పౌండ్స్, ఎనిమిదివనెలలో 4 పౌండ్స్ దాదాపు 16 అంగుళాల పొడవు వుంటుంది. 9 వ నెలలో శిశువు 6 నుంచి 8 పౌండ్స్ వుంటుంది. 9 వ నెలకు కడుపులోని బిడ్డ  పూర్తిగా అన్ని అవయవాలతో తయారయి ప్రసవానికి రెడీ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: