ఈ కాలంలో ఆడవాళ్లు  ఆహారానికి పెడుతున్న ఖర్చు కంటే సౌందర్యానికి పెడుతున్న ఖర్చు అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఆడవాళ్ళకి అందం అంటే అంత ఇష్టం మరి. ఇక కేశ సంరక్షణ  కోసం మరింత ఖర్చే పెడుతున్నారు. అయితే సౌందర్యాన్ని కాపాదుకునేందుకు,పోషణకు మార్కెట్లో ఎన్నో ఉత్పత్తులున్నప్పటికీ సహజంగా లభించేవాటిలో సౌందర్య పరిరక్షణ చేసుకోవడం సులువు అందులోను మంచిది. ఎందుకంటే ఇలా సహజంగా తయారుచేసుకున్న వాటిలో ఎటువంటి కెమికల్స్ అనేవి కలపము కాబట్టి. అందులోను  ఖర్చు తక్కువ కూడా.అలాంటి కోవకు చెందిన వాటిలో ఎంతో మేలైనది మందారం.. ఏంటి తల్లో పెట్టుకునే పువ్వు ఆడవాళ్ళ అందానికి ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తున్నారా.. !! అవును ఈ మందారం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అవేంటో ఒక చూపు చూద్దాం.
చూసాక ఒక్కసారి చేద్దాం.. 

 

 


మందార మొక్క నుంచి లభించే ఆకులు, పువ్వులు కూడా సౌదర్యాన్ని పరిరక్షించేందుకు ఎంతగానో తోడ్పడతాయి. ఈ మొక్క నుంచి నూనె తీస్తారు.ఆ  మందార నూనె  తలవెంట్రుకలను పరిరక్షించటమే కాక చర్మ రక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మందార నూనెలో తేమ ఉంటుంది కనుక చర్మానికి, కేశాలకు మృదువుగా ఉండేందుకు  తోడ్పడుతుంది. మందార నూనె కలిపిన నూనె కేశాలకు రాస్తే ఆ కేశాలు మరింతగా మెరిసి అందాన్ని , మెరుపుని ఇస్తుంది. ఈ నూనెతో మసాజ్ చేస్తే చుండ్రు నివారించవచ్చు. జుట్టు రాలటం తగ్గడమే  కాకుండా  ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కేశాలు తెల్లబడకుండా ఉండేందుకు  ఉపకరిస్తుంది. అంతేకాక దృఢంగా ఉండేందుకు మెరుపుతో ఉండేందుకు  ఈ నూనె ఉపయోగపడుతుంది.

 

 

 

కేశాలకు వృద్దాప్య  చాయలు దరి చేరకుండ చూస్తుంది. చర్మం నునుపుగా  ఉండెలగా  చూస్తుంది. చర్మం లో మృత కణజాలం లేకుండా చూస్తుంది. స్నానానికి వెళ్లేముందు మందార నూనె నీటిలో వేయటం వల్ల శరీరం అందంగా ఉండటమేకాక సుగంధభరితంగా ఉంటుంది. పాదాల సంరక్షణలోనూ తన ఉనికి చూపిస్తుంది. పాదాల పగుళ్ళు తగ్గేందుకు ఈ నూనెతో మసాజ్ ఇస్తే మంచి ఫలితాలొస్తాయి.అలాగే మందార పువ్వు, ఆకులు కూడా జుట్టు పెరగడంలో మంచి పాత్ర వహిస్తాయి. అసలు  ఆడవాళ్లు అప్పట్లో తలస్నానం కుంకుడు కాయలతో చేసేవాళ్ళట. ఆ కుంకుడు రసంలో కొన్ని మందారం ఆకులు వేసుకుని ఆ గుజ్జుతో తలకి స్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గి బాగా ఒత్తుగా పెరుగుతుందని అలా చేసేవారట.. ఒక్కసారి ట్రై చేసి చుడండి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేమంటే మందారం అన్నిచోట్ల విరివిగా దొరకుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: