తల్లి కాబోయే ప్రతి మహిళకు కడుపులో పెరిగే బిడ్డ గురించి ఆలోచన ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల సంఖ్యను పెంచుతూ, ఈ ప్రపంచంలోకి వచ్చే ఆనందాల మూట మీ బిడ్డ. ప్రతి సంవత్సరం మీ కుటుంబం పండగ జరుపుకోవడానికి  మీ ఆశలకు రూపాన్ని పోస్తూ రాబోయే మీ చిట్టి యువరాణిని మీరు కడుపులో మోసున్నారని తెలుసుకోవడానికి కుతూహలంగా ఉన్నారా? అయితే మీ చిన్నారి పాపాయి మీకు గుర్తు చేస్తున్న కొన్ని లక్షణాలను తెలుసుకుందామా.. మనము మన కుటుంబంలోకి ఒక యువరాణిని ఆహ్వానిస్తున్నాం అని ఎల్లప్పుడూ అంచనా వేయడానికి  మనకి మన బామ్మలు చెప్పే కథలు, నమ్మకాలు మరియు గాథలలో కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. అయితే ఈ అంచనాలు కొంతమంది కాబోయే తల్లులను మాత్రమే చేరుకుంటాయి. 

 

 


కొంతమంది విషయంలో జరగవు. ప్రాథమికంగా గర్భధారణ సమయంలో హార్మోన్ల సమతుల్యత లేదా అసమతుల్యత వల్ల ప్రతి ఒక్క స్త్రీలో వ్యత్యాసం ఉంటుంది. అంతేకాక ప్రతి స్త్రీ యొక్క శరీరతత్వం ఒక ప్రత్యేక స్వభావం కలిగి ఉంటుంది.కానీ ఇప్పటికీ మనలో చాలా మంది ఈ విషయంలో మన పెద్దల అంచనాలను అనుసరిస్తున్నారు.  అలాంటి అద్భుతమైన మన పూర్వీకుల జాబితాలలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాము. ఆడ శిశువు ఎక్కువగా ఎగువ కడుపున పెరుగుతుంది. అందువలన ఎగువ కడుపు పెరిగినట్లు కనిపిస్తుంది. గర్భధారణలో మగ శిశువుతో పోలిస్తే ఆడ శిశువుని కలిగిన తల్లికి ఉదయకాల అనారోగ్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఆడ శిశువు తీసుకువస్తున్న హార్మోన్ల వలన జరగుతుందని చెప్తారు. 

 

 

 

కాబోయే తల్లి ఉహించిన నెల సంఖ్యకు ఆమె వయస్సును కలిపినప్పుడు, వచ్చిన సంఖ్య బేసి సంఖ్య అయినట్లయితే, మీ ఇంటికి యువరాణి వస్తున్నట్లే. వెంటనే మీ ఇంటిని అలంకరించండి.కాబోయే తల్లి  కారంగా ఉండే పదార్ధాలను కాకుండా తీపి పదార్ధాల మీద మరింత ఇష్టం  కలిగి ఉన్నట్లయితే, ఆమె కడుపులో ఉన్నది పండంటి ఆడ శిశువుగా చెప్పవచ్చు. మరికొన్ని బుజ్జి బుజ్జి అడుగుల ఆడపిల్ల లక్షణాలు తర్వాత కధనంలో చూద్దాం.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: