జుట్టు రాలడం అనేది నేడు మనం ఎదుర్కొంటున్న అతి ప్రధాన సమస్య. దీని పట్ల ఎంతోమంది  నిరాశగా ఉన్నారు.  దువ్వెన ఉపయోగించిన ప్రతీసారీ జుట్టు చాలా మొత్తంలో రాలిపోతూ ఉంటుంది. ఇది నిజంగా ఎంతో ఆందోళన కలిగించే విషయంకొబ్బరి గుజ్జు నుండి సహజంగా సేకరించిన పాలు జుట్టు రాలే సమస్యను నియంత్రించడంలో చాలా గొప్పగా పనిచేస్తుంది. కొబ్బరి పాలు జుట్టుకి పోషణ అందించడంలో సహాయపడుతుంది. కొబ్బరి గుజ్జుని ముక్కలుగా కోసి బాగా మిక్సీ పట్టండి. ఆ ధ్రవాన్ని ఒక మెత్తటి వస్త్రంలో వేసి బాగా పిండి దాని నుండి కొబ్బరి పాలని సేకరించండి. 

 

IHG

 

ఇప్పుడు ఆ కొబ్బరి పాలని కుదుళ్ళకి పట్టించి బాగా మసాజ్ చేయండి. ఇలా చేయడం వలన జుట్టు రాలే సమస్యను అరికట్టవచ్చు. వేప మొక్క మీ చర్మానికే కాదు జుట్టుకి కూడా మంచిగా పనిచేస్తుంది. ఇది క్రిమినాశకరం మరియు వైరస్ అలాగే బ్యాక్టీరియా ప్రభావాలను నిర్మూలిస్తుంది. కొన్ని తాజా వేప ఆకులను తీసుకుని వాటిని మంచి నీటిలో వేసి బాగా మరగనివ్వాలి. తీసుకున్న నీటికి సగం అయ్యేంత వరకు మరగపెట్టాలి అలా నీరు పచ్చ రంగు లోకి మారుతుంది. ఇప్పుడు ఆ నీటిని చల్లార్చి మాడుకి బాగా పట్టించి మర్దనా చేసుకోవాలి.

 

IHG

ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.నిస్తేజంగా మరియు బలిహీనంగా ఉండే జుట్టుకు చికిత్స చేయటానికి మహిళలు దశాబ్దాలుగా ఉసిరిని ఉపయోగిస్తున్నారు. ఎండబెట్టిన ఉసిరిని తీసుకుని వాటిని కొబ్బరి నూనెలో మరగబెట్టాలి. ముదురు నల్ల రంగులోకి మారేంత వరకూ దానిని మరగనివ్వాలి. అప్పుడు దానిని చల్లార్చి జుట్టు కుదుళ్ళ నుండి చిగుర్ల వరకు పూర్తిగా పట్టించాలి. 

 

IHG


ఇది జుట్టు రాలే సమస్యను అరికట్టడానికి మరొక సమర్థవంతమైన చిట్కాలలో ఒకటి.మీ జుట్టుని స్టైలిష్ గా కనిపించేందుకు దాన్ని బిగుతుగా పట్టి ఉంచేలా చేసే విధానాలకు స్వస్తి చెప్పాలి. ఇది మీ జట్టులోని ప్రతి వెంట్రుక మీద ఎంతో ఒత్తిడిని కలిగిస్తుంది. తద్వారా జుట్టు కుదుళ్ళు పగిలిపోయే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: