అబ్బాయి అందం, ఆస్థి చూసి ఇష్టపడే అమ్మాయిలు ఉన్న ఈ కాలంలో అదే అమ్మాయిలు తమ బిడ్డను చూడకుండానే తల్లి అవుతున్నాం అనే ఆనందంతో కడుపులో పెరిగే బిడ్డను ఎంతో ప్రేమగా చూసుకుంటారు, ప్రేమిస్తారు. కడుపులో బిడ్డ ఉంది అని తెలిసినప్పటి నుండి బిడ్డ పుట్టేవరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మనకు జన్మనిస్తుంది మన తల్లి. 

 

IHG

 

మనకు జన్మనివ్వడం ఒక ఎత్తు అయితే తల్లి పుట్టిన సమయం నుండి తనకోసం తీసుకునే జాగ్రత్తలు మరెన్నో. అవి అన్ని చెప్పిన అర్థం కాదు.. చూస్తే తప్ప. తన ప్రేమ అనంతం. ఎంతటి స్త్రీ అయినా ఇంట్లో పనులు చేసుకుంటూనే బిడ్డను చూసుకోవాలి. తల్లి ఆర్ధికంగా స్థిరంగా ఉంటే సమస్య లేదు కానీ కొంచం ఆర్ధికంగా సమస్య ఉంటే బయట పని చేస్తూ మిమ్మల్ని చూసుకోవాలి. 

 

IHG

 

ఎన్నో కష్టాలు పడి తను తిన్న తినకున్న మనకు పెట్టి.. మంచి చదువు చెప్పించి.. పెద్ద చేస్తే.. మనం ఏం చేస్తున్నాం. ఉద్యోగం రాగానే పరాయి దేశాలకు పారిపోయి అక్కడ సంపాదించి విలాసాలు అనుభవిస్తున్నాం. ఇక్కడ తల్లికి ఉండటానికి బ్రతకడానికి డబ్బు అయితే పంపుతున్నావు కానీ ఒకసారి చూడటానికి కూడా రాకుండా నీ మొఖమే బంగారం అయ్యేలా చేస్తున్నావు. 

 

IHG

 

నీ కన్నతల్లి నిన్ను ఎంత జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుందో తాను వృద్ధు రాలు అయినప్పుడు మనం అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే నీ పుట్టుకకు ఒక అర్ధం ఉంటుంది. తల్లిని తన వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. 

మరింత సమాచారం తెలుసుకోండి: