పురాతన కాలం నుండి మన పెద్దవాళ్ళు కొన్ని వంట ఇంట్లో దొరికే వస్తువులతో  అందాన్ని కాపాడుకునేవారు. మనలా బ్యూటీ పార్లర్లకు వెళ్ళేవాళ్ళు కాదంట. ప్రత్యేకించి అందం కోసం ఆ తరం వాళ్ళు  ఏమీ చేసేవాళ్లు కాదట. అయితే ఆ తరం పెద్దవాళ్ళ అందం రహస్యం ఏంటో ఈరోజు మన తరం వాళ్ళం తెలుసుకుందాం. పాత తరానికి కొత్త తరానికి ఉన్న తేడా ఏంటో చూద్దాం. పాత  తరానికి మనలా  సబ్బులు , షాంపూలు తెలియవు. వాటికి బదులుగా నలుగు, కుంకుడుకాయ‌లు వాడేవాళ్లు. అందుకే  జుట్టు, చర్మం ఇప్పటికీ అందంగానే ఉన్నాయి. మేం పసుపు, గంధం వంటివి ఉపయోగించేవాళ్లు  ఇప్పటికీ వాడుతున్నారు. 

 

 


కాని ఈ తరంలో  మాత్రం వాటినే దూరంగా పెట్టి బోలెడు డబ్బులు ఖర్చుపెట్టి మార్కెట్లో దొరికేవాటిని ఉపయోగిస్తున్నారు.  సబ్బుకు  బదులుగా నలుగుపిండి ఉపయోగించేవారు. దాని కోసం పెసరపిండి, శనగపిండి, పసుపు కలిపి ఉపయోగించేవారు. ఇది చర్మ రంధ్రాల్లోని మురికిని వదిలిస్తుంది. చర్మంపై చేరిన మృతకణాలను తొలగిస్తుంది. దీనివల్ల చర్మం మృదువుగా మారడంతో పాటు ప్రకాశవంతంగా కనిపిస్తుంది. పైగా చర్మంపై ఉన్న అవాంఛిత రోమాలు సైతం తగ్గుముఖం పడతాయి. అందుకే పెళ్లిలో వధూవరులకు నలుగు పెట్టి స్నానం చేయించడం ఇప్పటికి ఆచారం.. అలా నలుగు పెట్టడం వల్ల వధూవరుల ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.. పెళ్ళిలో చూడడానికి అందంగా ఉంటారు. అలాగే ఈ మిశ్రమంలో పాలు లేదా పెరుగు కలిపి ఉపయోగిస్తే చర్మం శుభ్రపడటం మాత్రమే కాదు మాయిశ్చరైజ్ కూడా అవుతుంది.పసుపు ముఖ వర్ఛస్సుని పెంపొందిస్తుంది. దీనిలో ఉన్న యాంటిబయోటిక్, యాంటి సెప్టిక్ గుణాల వ‌ల్ల‌ ముఖంపై మొటిమలు రాకుండా ఉంటాయి. 

 

 


మన ముందు తరం వరకు అంటే బామ్మ, అమ్మ తలస్నానం చేసిన ప్రతిసారి ముఖానికి పసుపు రాసుకొంటారు. అందుకే వారి ముఖంపై మొటిమలు కనిపించవు. పైగా చర్మం ఛాయ సైతం మెరుగుపడుతుంది. పసుపు శరీరంపై ఉన్న అవాంఛిత రోమాలను తగ్గిస్తుంది. శనగపిండిలో కొద్దిగా పసుపు కలిపి నలుగు పెట్టుకొని స్నానం చేస్తే స్కిన్ అందంగా తయారవుతుంది.మరికొన్ని పాతతరం బ్యూటీ టిప్స్ రేపు చూద్దాం...!!!

మరింత సమాచారం తెలుసుకోండి: